న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఉత్తర కాశీలో భూకంపం

ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలో శనివారం భూకంపం చోటు చేసుకుంది.

రిక్టార్ స్కేల్ పై 4.2 గా.తీవ్రత నమోదయ్యింది. 

2.ఇండియన్ రైల్వే లో ఉద్యోగాలు

  ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆర్ ఆర్ సీ భువనేశ్వర్ పరిధిలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.ఈ నోటిఫికేషన్ ద్వారా 756 అప్రంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. 

3.యాదాద్రి కి చేరుకున్న కెసిఆర్

 

తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి లో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా యాదాద్రి కొండపై ఉత్తరదిశగా 105 కోట్లతో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్స్ ను కేసీఆర్ ప్రారంభించారు. 

4.కర్నూలు కు సంజీవయ్య పేరు పెట్టాలి : వీహెచ్

  కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు డిమాండ్ చేశారు. 

5.కెసిఆర్ షర్మిల విమర్శలు

 

ప్రధాని నరేంద్ర మోదీ ని తరుముడు ఏమో కానీ, నోటిఫికేషన్ ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మిమ్మల్ని తరమకుండా చూస్కో అంటూ షర్మిల విమర్శించారు. 

6.విబజన సమస్యలపై కేంద్రం కీలక నిర్ణయం

  తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం దృష్టి పెట్టింది.దీనిపై ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 

7.బండి సంజయ్ కామెంట్స్

 

Advertisement

కల్వకుంట్ల రాజ్యాంగం కావాలో, అంబేత్కర్ రాజ్యాంగం కావాలో ప్రజలు తేల్చుకోవాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు.తన అవినీతిపై విచారణ ప్రారంభం అయిందనే కేసీఆర్ ప్రస్టేషన్ కి గురవుతున్నారని సంజయ్ విమర్శించారు. 

8.రేపటి నుంచి మేడారంలో హెలికాప్టర్ సేవలు

  రేపటి నుంచి మేడారం లో హెలికాఫ్టర్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. 

9.మన ఊరు మన బడి కి మానిటరింగ్ సెల్

 

మన ఊరు మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 

10.ప్రశ్నాపత్రం లీకేజీ పై దర్యాప్తు

 పాలిటెక్నిక్ పరీక్ష పత్రం లీకేజీ పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

11.పెద్ద పులి సంచారం

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం లో పెద్దపల్లి సంచరిస్తోందని, అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. 

12.తుపాకీ మిస్ ఫైర్ .హెడ్ కానిస్టేబుల్ మృతి

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం పరిధిలోని కాచనపల్లి పోలీస్ స్టేషన్ లో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ సంతోష్ అక్కడికక్కడే మృతి చెందారు. 

13.తిరుమల సమాచారం

 

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శుక్రవారం తిరుమల శ్రీవారిని 30,609 మంది భక్తులు దర్శించుకున్నారు. 

14.యాదాద్రి లో కాంగ్రెస్ బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్

 తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా అల్లర్లు చోటు చేసుకోకుండా , బిజెపి , కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

15.21 నుంచి బెస్ట్ పథకానికి దరఖాస్తు ఆహ్వానం

  ఈ నెల 21వ తేదీ నుంచి తెలంగాణ వ్యవస్థాపక బ్రాహ్మణ వ్యవస్థాపకత పథకం ( బెస్ట్ ) ద్వారా ఆర్థిక సహాయం పొందాలనుకునే పారిశ్రామిక వేత్తలు ఈ నెల 21 నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 

16.స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన

 

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అల్లు అర్జున్ తో డాన్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను.. రష్మిక సంచలన వ్యాఖ్యలు!

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా విశాఖ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

17.అశోక్ బాబు కు చంద్రబాబు పరామర్శ

 

Advertisement

ఇటీవల అరెస్ట్ అయ్యి బెయిల్ పై విడుదల అయిన టీడీపి ఎమ్మెల్సీ అశోక్ బాబు ను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరామర్శించారు. 

18.గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న కేంద్రమంత్రి

హైదరాబాద్ నుంచి కేంద్ర మంత్రి రాందాస్ అద్వానీ గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. 

19.భారత్ లో కరోనా

 

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 50,407 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,800   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 51,050    .

తాజా వార్తలు