ఉగాది అనగానే పంచాంగం, జ్యోతిష్యాలు, గ్రహాలు, అనుగ్రహాల గురించే పండితులు చెబుతుంటారు.ఏ రాశి వారికి కెలా ఉంటుంది ? ఇలా అనేక అంశాలపై బోలెడంత చర్చ జరుగుతుంది.ఇక పండితులు సైతం తమ అభిప్రాయాలను పెద్ద ఎత్తున వెల్లడిస్తుంటారు.తాజాగా ప్రముఖ జ్యోతిష్య పండితుడు మాండ్రు నారాయణ రమణారావు సిద్ధాంతి ఏపీ సీఎం గురించి జ్యోస్యం చెప్పారు.
ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా జగన్ ముందు చిత్తవుతాయని వెల్లడించారు.ఇక ఏపీ సచివాలయలో ప్రతికూల శక్తులు బలంగా పనిచేస్తున్నాయని, అక్కడ మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ప్రస్తుతల గ్రహాలు,నక్షత్రాలను బట్టి చూస్తే ఏపీ సీఎంగా జగన్ మరోసారి అధికార పగ్గాలు పట్టబోతున్నాడని సంచలన వ్యాఖ్యలు వెల్లంచారు.గ్రహాలు కుజుడు, రవి, చంద్రుడు, శని, శుక్ర వంటివి జగన్కు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు.
అంతేకాకుండా ఛాయా గ్రహాలైన రాహు, కేతువులు మే నుంచి సానుకూల ప్రభావాన్ని చూపించనున్నాయన్నారు.దీంతో వచ్చే ఎన్నికల్లో 120-150 సీట్లలో ఆయన గెలిచి అధికారాన్ని చేపడతారని వెల్లడించారు.
ప్రస్తుత మాదిరిగా కాకుండా తూర్పు ఆగ్నేహ స్థానంలో కూర్చుని పాలన చేస్తే రాజకీయంగా మరింత పట్టు పెరుగుతుందని చెప్పారు.మరోవైపు ఏపీ సెక్రటేకరియట్ వాస్తు అధ్వానంగా ఉందని, దీంతో సచివాలయంలో ప్రతికూల శక్తులు బలంగా ఉన్నాయన్నారు.
మార్పులు గనుక చేస్తే కోర్టు కేసులు, పెండింగ్ పనుల్లో కదలిక వస్తుందన్నారు.ఇక అసెంబ్లీ నిర్మాణంలోనూ కొన్ని మార్పులు చేసే్త మూడు రాజధానుల కల నెరవేరుతుందని జోస్యం చెప్పారు.

మొత్తంగా జగన్కు గ్రహాలు, జాతక రీత్యా అధికారం కట్టబెట్టే దిశగా పయనిస్తుంటే విపక్షనేత, టీడీపీ అధినేత జాతక రీత్యా బాబుకు సంబంధించిన కీలక గ్రామాలు రోజురోజుకు బలహీనపడుతున్నాయని చెప్పారు.ప్రధానంగా రవి, శని, శుక్ర, చంద్ర గ్రహాలతోపాటు ఛాయా గ్రహాలు రాహు, కేతువులు నీరసపడుతున్నారని వెల్లడించారు.ఈ గ్రహాల పరిస్తితి ఇలానే కొనసాగితే బాబు రాజకీయ భవిష్యత్ లేనట్టేనని వెల్లడించడం గమనార్హం.ఈ కారణాలతో బాబుతో జత కట్టే వారి గ్రహం బలంగా ఉన్నా బాబు గ్రహాల దృష్య్టా అవి నీరసించిపోతాయని, ఆయ గ్రహబలాల దృష్య్టా ఆయనకు రాజకీయ యోగం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరి ఈ గ్రహాల లెక్కన జగన్ మరోసారి సీఎం అవుతాడా ? లేదా ? అన్నది వేచి చూడాలి.







