మెగా హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ నటించిన గని సినిమా ఈ నెల 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.ఆర్ఆర్ఆర్ రిలీజైన రెండు వారాల తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు నెలకొన్నాయి.
గని మూవీ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినా ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలకు సినిమాలో ప్రాధాన్యత ఇచ్చామని ట్రైలర్ ద్వారా మేకర్స్ చెప్పకనే చెప్పేశారు.
అయితే వరుణ్ తేజ్ ఇప్పటికే చాలా సినిమాల్లో నటించినా వరుణ్ తేజ్ నాగబాబు కలిసి నటించలేదు.
ఈ మధ్య కాలంలో నాగబాబు సైతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.వరుణ్ తేజ్ ఒక ఇంటర్వ్యూలో నాగబాబు పరిమితంగా సినిమాలలో నటించడం గురించి మాట్లాడుతూ నాన్నగారు వెళ్లి ఎవరినీ పాత్రలు అడగరని చెప్పుకొచ్చారు.
సాధారణంగా ఆర్టిస్టులు అన్నవాళ్లు పాత్రలు అడగాలని వరుణ్ తేజ్ కామెంట్లు చేశారు.
నాన్న తనకు ఉండే స్పేస్ లో హ్యాపీగా ఉన్నారని వరుణ్ తేజ్ పేర్కొన్నారు.

ఒక సినిమా చాలు, ఒక టీవీ షో చాలు, ఇంటికొచ్చి చిల్ అవుతానని నాన్న భావిస్తాడని వరుణ్ తేజ్ వెల్లడించారు.అయితే నాన్న సినిమాలతో బిజీగా ఉండాలని నేను కోరుకుంటానని వరుణ్ తేజ్ వెల్లడించారు.నాన్న ఈ మధ్య సన్నబడ్డారని వెజిటేరియన్ అయ్యారని వరుణ్ తేజ్ పేర్కొన్నారు.తాను, నాన్న కలిసి సినిమాలు చేయాలని అనుకున్నామని వరుణ్ అన్నారు.

రెండు మూడు సినిమాలలో కలిసి నటించే సందర్భాలు వచ్చాయని వరుణ్ తేజ్ పేర్కొన్నారు.అయితే స్క్రీన్ పై తండ్రీకొడుకులుగా కనిపిస్తే ఫేక్ గా ఉంటుందని భావించి వద్దని అనుకున్నామని వరుణ్ తేజ్ పేర్కొన్నారు.మంచి పాత్ర దొరికితే తాను నాన్న కలిసి నటిస్తామని వరుణ్ తేజ్ వెల్లడించారు.గని మూవీ కోసం బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నానని వరుణ్ తేజ్ వెల్లడించారు.







