టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ నిశ్శబ్ధం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్‌డౌన్‌తో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.అయితే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి ఏమాత్రం కనిపించకపోవడంతో ఈ సినిమా రిలీజ్ అయోమయంలో పడింది.
అయితే ఈ సినిమా రిలీజ్‌పై ఇటీవల చిత్ర నిర్మాత కోన వెంకట్ ఓ క్లారిటీ ఇచ్చారు.ఒకవేళ థియేటర్లు తెరుచుకుంటే సినిమాను రిలీజ్ చేస్తామని, లేకపోతే ఓటీటీలో చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు.
దీంతో ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.కానీ నిశ్శబ్దం సినిమా సైలెంట్ అయిపోవడంతో, ఈ సినిమాను రిలీజ్ చేస్తారా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది.
ఒకవేళ ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించకపోవచ్చు అనే అనుమానం చిత్ర యూనిట్‌లో నెలకొందని తెలుస్తోంది.అందుకే వారు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారట.
ఇక ఈ సినిమాలో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తుండగా మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.అందాల భామ షాలిని పాండే, అంజలి కూడా ఈ సినిమాలో నటిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
మరి నిశ్శబ్దం చిత్ర రిలీజ్‌పై ఈ నిశ్శబ్దం ఎప్పుడు తొలిగిపోతుందో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy