టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోలతో పాటు సమానమైన క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది అనుష్క అనే చెప్పాలి అటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే ఇటు స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన అనుష్క…బాహుబలి వంటి క్రేజీ ప్రాజెక్టు తర్వాత ఈమె నిశబ్దం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పెద్దగా ప్రేక్షకు ఆదరణ పొందలేకపోయింది.
ఈ సినిమా తర్వాత దాదాపు రెండు సంవత్సరాల పాటు ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వని అనుష్క ప్రస్తుతం యు వి క్రియేషన్ బ్యానర్లో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు…
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో అనుష్క ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా అనుష్క ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా తాను నటించిన సినిమాలలో మీకు ఇష్టమైన సినిమాలు ఏంటి అని ప్రశ్నించడంతో తనకు అరుంధతి సినిమా, వేదం సినిమా చాలా ఇష్టమని తెలియజేశారు…/br>
ఈమె ( Anushka ) ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరి సరసన నటించిన విషయం మనకు తెలిసిందే.అయితే మీకు నచ్చని సినిమా ఏది అని ప్రశ్నించగా బాలయ్యతో కలిసి నటించిన ఒక్క మగాడు సినిమా తనకు ఏమాత్రం నచ్చదు అంటూ అనుష్క చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.ఇలా బాలయ్యతో సినిమా చేయడమే కాకుండా ఆ సినిమా తనకు ఏమాత్రం నచ్చలేదంటూ అనుష్క నిర్మొహమాటంగా చెప్పినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక మీ గురించి సోషల్ మీడియా( Social media )లో వచ్చిన గాసిప్ ఏంటి అని అడగడంతో ఈమె మాట్లాడుతూ నాకు ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఏకంగా ఐదు మంది హీరోలతో పెళ్లిళ్లు చేశారు అంటూ అనుష్క నవ్వుతూ సమాధానం చెప్పారు.ఇదే తన గురించి వచ్చిన పెద్ద గాసిప్ అంటూ ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మరి ఆ హీరోలు ఎవరు ఏంటి అనే విషయానికొస్తే గోపీచంద్, ప్రభాస్, సుమన్, సెంథిల్, అంటూ సమాధానం చెప్పుకొచ్చారు…ఏ విషయాన్ని అయినా ఆమె చాలా లైట్ గా తీసుకుంటూ ముందుకు వెళ్తారు, కాబట్టే ఆమె ఏ టెన్షన్ లేకుండా చాలా కూల్ గా ఉండగలుగుతున్నారు…ఆమె అలా ఉండటానికి కారణం ఎంటి అంటే ఆమె డైలీ యోగ చేయడమే అని ఆమె చాలా సార్లు తెలియజేశారు…ఇక ఆమె ఇండస్ట్రీ కి రాకముందు యోగ టీచర్ గా ఉన్న సంగతి మనకు తెలిసిందే…
.