నిన్న రాత్రి నరేంద్ర మోదీ స్టేడియంలో( Narendra Modi Stadium ) ఆస్ట్రేలియా, టీమ్ ఇండియా మధ్య జరిగిన ఫైనల్ లో కంగారుల టీం గెలిచింది.ఈ వన్డే వరల్డ్ కప్ లో( Cricket World Cup ) ఇండియా గెలుస్తుందని చాలామంది కలలు కన్నారు.
ఇండియా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అనుకున్నారు.కానీ ఆ అవకాశాన్ని ఆస్ట్రేలియన్ టీమ్ ఇవ్వలేదు.
నిన్న ఈవెనింగ్ స్టేడియంలో ఒక లక్షా 30 వేల మంది బ్లూ కలర్ జెర్సీలు ధరించి మ్యాచ్ వీక్షించారు.
ఇండియా బాగా ఆడుతుంటే వారు చెవులకు చిల్లులు పడేలా అరిశారు.
కానీ ఆస్ట్రేలియన్ బౌలర్స్, బ్యాటర్స్ వారి అద్భుతమైన ప్రదర్శనతో మన అభిమానులను సైలెంట్ చేశారు.చేజింగ్ లో ట్రవీస్ హెడ్( Travis Head ) చూపించిన ఓపిక, టెరిఫిక్ పెర్ఫార్మెన్స్‌కు ఫాన్స్ నిశ్శబ్దంగా నిట్టూర్చారు.
టోర్నమెంట్‌లో 11 మ్యాచ్‌లు ఆడితే ఇండియా( India ) 10 మ్యాచ్‌లు గెలిచింది కానీ అసలైన ఫైనల్‌లో ఓడిపోయింది.అదే అందరినీ కంటతడి పెట్టించింది.
ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండియా బ్యాటింగ్ చేసింది.కోహ్లీ( Kohli ) హాఫ్ సెంచరీ చేసినాక క్లీన్ బోల్డ్ అయ్యాడు.
ఆ సమయంలో స్టాండ్స్ లో ఉన్న కోహ్లీ సతీమణి అనుష్క శర్మ( Anushka Sharma ) చాలా షాక్ అయింది.అయ్యో అంటూ ఆమె చేసిన ఎక్స్‌ప్రెషన్స్ కూడా కనిపించాయి.
అంతేకాకుండా ఇండియా బాగా ఆడుతున్నప్పుడు ఆమె నవ్వుతూ కనిపించింది.కుమార్తె వామికతో( Vamika ) కలిసి అహ్మదాబాద్‌కు చేరుకున్న ఆమె భారత్‌తో పాటు తన భర్త విరాట్ కోహ్లిని ఎంకరేజ్ చేస్తూ కనిపించింది.మొత్తం మీద సెలబ్రిటీలలో అనుష్క శర్మనే ఎక్కువగా ఆకర్షించింది.అయితే ఆమె డ్రెస్( Dress ) చాలా సింపుల్‌గా, క్యూట్‌గా ఉండటం ప్రస్తుతం ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారింది.
ఫైనల్ మ్యాచ్ కోసం, అనుష్క బ్రీజీ బ్లూ అండ్ వైట్ ప్రింటెడ్ డ్రెస్‌లో చాలా స్టైల్‌గా మెరిసింది.అయితే ఇది చాలా ఖరీదైన డ్రెస్‌గా కనిపించిన దీని ధర మాత్రం చాలా తక్కువే.
ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ కోసం అనుష్క ధరించిన దుస్తులు ఇండియన్ బ్రాండ్ నికోబార్‌కు( Nicobar ) చెందినది.వీటి ధర కేవలం రూ.7,250 మాత్రమే.మధ్యతరగతి ప్రజలు కూడా ఈ ధర పెట్టి డ్రెస్సులు కొనుగోలు చేయగలరు.
కాబట్టి అనుష్క చాలా సింపుల్ గా ఈ మ్యాచ్ కు హాజరయ్యిందని చెప్పుకోవచ్చు.బ్రాండ్ వెబ్‌సైట్‌లోని డిస్క్రిప్షన్ ప్రకారం, డ్రెస్‌కు పాకెట్స్ కూడా ఉంటాయి.