అంచనాలు పెరిగి పోతూనే ఉన్నాయి

Anushka Looks Increased Hype Of The Movie

అనుష్క వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లకు చేస్తూ దూసుకు పోతుంది.ఇప్పటికే ఈమె నటించిన ‘బాహుబలి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.

 Anushka Looks Increased Hype Of The Movie-TeluguStop.com

వచ్చే సంవత్సరం ‘బాహుబలి’ ద్వితీయ పార్ట్‌ రాబోతుంది.ఇక ఈమె ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.

ఈ రెండు చిత్రాలతో పాటు ఈమె నటించిన మరో చిత్రం ‘సైజ్‌ జీరో’ చిత్రం కూడా విడుదలకు సిద్దంగా ఉంది.

ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైజ్‌ జీరో’ చిత్రంపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

సినిమా ఫస్ట్‌లుక్‌ నుండి కూడా చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించడంలో చిత్ర యూనిట్‌ సభ్యులు సక్సెస్‌ అయ్యారు.రోజుకో పోస్టర్‌ చొప్పున విడుదల చేస్తూ ఉండటంతో సినిమాపై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు రోజు రోజుకు పెరిగి పోతూను ఉన్నాయి.

అక్టోబర్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమాను ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మించాడు.అనుష్కకు జోడీగా ఆర్య నటించాడు.

వీరిద్దరి కాంబినేషన్‌లో రొమాంటిక్‌ సీన్స్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube