రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది.ఈ క్రమంలో ఆయన మరణవార్త తెలుసుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి చేరుకుని.
ఆయన భౌతికదేహాన్ని సందర్శించింది.
కృష్ణంరాజు మృతిపట్ల అనుష్క తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
ఆయన మనసు చాలా గొప్పదని, ఎప్పటికీ అందరి హృదయాల్లో జీవించి ఉంటారని పేర్కొంది.ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించింది.
ఈ నేపథ్యంలో ఆయనతో కలిసి తీసుకున్న ఓ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.







