అమెరికాలోని ఎన్నికల్లో 'తెలుగు అమ్మాయి'..రికార్డ్

అమెరికాలో ఎంతో మంది తెలుగు వాళ్ళు ఉన్నారు.అమెరికా పౌరసత్వం తో అక్కడే స్థిరపడి ఇండో అమెరికన్స్ గా ఉంటున్న వారి లెక్క చాలానే ఉంది.అయితే అక్కడ ఉండే తెలుగు వాళ్ళు చాలా మంది రాజకీయాల్లో , సినిమా రంగంలో, అమెరికా ప్రభుత్వంలో కీలక పాత్రలు కూడా పోషిస్తున్నారు.ఇదిలాఉంటే….

 Anusha Kondiparthi In American Politics-TeluguStop.com


తాజాగా భారత సంతతికి చెందిన తెలుగు అమ్మాయి అనూష కొండపర్తి కాలిఫోర్నియా డెమోక్రాటిక్ పార్టీ డిస్ట్రిక్ట్ 28 డెలిగేట్ క్యాండిడేట్ ఎన్నికల్లో ఊహించని గెలుపుని అందుకుంది.అంతేకాదు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అతి చిన్న వయస్సు కలిగిన క్యాండిడేట్ గా కూడా ఆమె రికార్డ్ క్రియేట్ చేసింది.చిన్న వయస్సులోనే విజయాన్ని అందుకోవడంపై తెలుగు సంఘాలు ,బే ఏరియా లోని రాజకీయ ప్రముఖులు సైతం ఆమెకి శుభాకాంక్షలు తెలిపారు.


అయితే తనకి కాలేజీ రోజుల నుంచీ రాజకీయాలపట్ల ఆసక్తి ఉండేదని.కొంతమంది రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలతో ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేసినట్టుగా తెలిపారు.అనూష విజయం పట్ల వివిధ తెలుగు సంఘాలు సతోషం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube