ఐఏఎస్ కావాలంటే ఏ స్థాయిలో కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బాల్యం నుంచే ఐఏఎస్ కావాలని అనురాధ పాల్( Anuradha Paul ) లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని( Uttarakhand ) హరిద్వార్ జిల్లాలోని చిన్న గ్రామానికి చెందిన అనురాధ కోచింగ్ ఫీజుకు సైతం డబ్బులు లేకపోవడంతో పిల్లలకు ట్యూషన్ చెప్పడం ద్వారా ఫీజును చెల్లించేవారు.చిన్నప్పుడు నవోదయ స్కూల్ లో చదువుకున్న అనురాధ ఆ తర్వాత రోజుల్లో గోవింద్ బల్లభ్ పంత్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశారు.
బీటెక్ పూర్తైన తర్వాత తర్వాత అనురాధ పాల్ కు ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలలో ఒకటైన టెక్ మహీంద్రాలో( Tech Mahindra ) జాబ్ వచ్చింది.అయితే ఐఏఎస్ కావడం తన లక్ష్యం కావడంతో ఆ జాబ్ కు అనురాధ గుడ్ బై చెప్పి రూర్కీలోని కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో లెక్చరర్ గా పని చేశారు.2012 యూపీఎస్సీ పరీక్షలో( UPSC ) 451వ ర్యాంక్ రావడం వల్ల అనురాధ ఐఏఎస్ కు సెలెక్ట్ కాలేదు.అయితే అనురాధ మాత్రం కెరీర్ విషయంలో వెనుకడుగు వేయలేదు.

2015 సంవత్సరంలో మళ్లీ పరీక్ష రాసిన అనురాధ 62వ ర్యాంక్ సాధించడం ద్వారా ఐఏఎస్ ( IAS ) కావాలనే కలను నెరవేర్చుకున్నారు.తండ్రి పాలు అమ్మి కుటుంబాన్ని పోషించగా అనురాధ తన కష్టంతో ఉద్యోగం సాధించి కుటుంబ కష్టాలను తీర్చారు.కృషి, డృడ సంకల్పం ఉంటే సవాళ్లను అధిగమించడం సులువేనని అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ అనురాధ ప్రశంసలు అందుకుంటున్నారు.

ఎంతోమంది యువతకు ప్రేరణగా నిలిచిన అనురాధ రాబోయే రోజుల్లో మరింత సక్సెస్ సాధించడంతో పాటు ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.అనురాధ ప్రతిభకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ప్రతిభకు కృషి తోడైతే సక్సెస్ సొంతమని అనురాధ ప్రూవ్ చేస్తున్నారు.
అనురాధ కృషితో తనకు ఎదురైన సవాళ్లను అధిగమించి సత్తా చాటారు.







