నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇలా ఈ సినిమా అన్ని భాషలలోనూ మంచి కలెక్షన్లను రాబడుతూ విజయపతంలో దూసుకుపోతోంది.
ఇకపోతే ఈ సినిమా విజయవంతం కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ డైరెక్టర్ చందు మొండేటికీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
ఈ విధంగా అనుపమ డైరెక్టర్ కు క్షమాపణలు చెప్పడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… గుజరాత్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తనకు వెన్ను నొప్పి అధికంగా వచ్చిందని అయినా ఈ షెడ్యూల్ కష్టపడి పూర్తి చేశానని తెలిపారు.
అయితే ఒక రోజు టెక్నికల్ సమస్య కారణంగా షూటింగ్ బాగా ఆలస్యం అవడంతో చాలా ఫ్రస్టేషన్ కి గురై డైరెక్టర్ చెందుతో పనిచేయడానికి తను చాలా రిగ్రేట్ ఫీలవుతున్నానని ఈ సందర్భంగా ఈమె తెలిపారు.

ఆరోజు తాను అలా మాట్లాడి ఉండకూడదు నేను చేసింది పెద్ద తప్పు.ఆయనను అలా అన్నందుకు చాలా బాధపడ్డానని ఈ సందర్భంగా డైరెక్టర్ చందు మొండేటికీ బహిరంగంగా అనుపమ పరమేశ్వరన్ క్షమాపణలు తెలియజేశారు.ఇలా ఆయనతో పని చేయడం వల్లే ఈరోజు ఇంత మంచి విజయాన్ని అందుకున్నామని ఈ సినిమా విజయాన్ని ఇప్పటికి తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఈ సందర్భంగా అనుపమ వెల్లడించారు.
ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.