అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) పరిచయం అవసరం లేని పేరు ప్రేమమ్ సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈ మలయాళీ ముద్దుగుమ్మ అనంతరం తెలుగులో కూడా వరుస అవకాశాలను అందుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక తెలుగులో ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఎంతో పద్ధతిగా చీర కట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కొన్నిసార్లు పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తే కూడా ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటారు.
ఇక ప్రస్తుతం ఈమె సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) తో కలిసి టిల్లు స్క్వేర్ సినిమా( Tillu Square )లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే .ఈ సినిమాలో కాస్త బోల్డ్ సన్నివేశాలలో కూడా ఈమె నటించారని ఇటీవల సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది.ఇలా ఇటీవల కాలంలో లిప్ కిస్ సీన్లకు( Lip Kiss Scenes ) కూడా అనుపమ సై అంటున్నారు.
ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.ఈ వీడియోలో భాగంగా ఈమె వెకేషన్ బయలుదేరినప్పటి నుంచి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నటువంటి సంఘటనలన్నింటిని కలిపి ఒక వీడియోగా చిత్రీకరించారు.
ఇందులో భాగంగా ఈమె బీచ్ లో పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
అయితే ఈ వీడియోలో అనుపమ పొట్టి పొట్టి దుస్తులను ధరించి భారీ స్థాయిలో గ్లామర్ షో( Anupama Glamor Show ) చేస్తున్నారు.ఇలా ఈ వీడియోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.భూమి ఆకాశం కలిసిపోయాయనే ఫీలింగ్ కలుగుతుంది అంటూ చెప్పుకువచ్చారు.
ఇక ఈ వీడియో పై ఎంతో మంది నెటిజెన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు కుర్రకారులు ఈ వీడియో పై ఫీల్ అవుతూ బ్రేకప్ చెప్పిన బాధ కలగదు కానీ నువ్విలా మారిపోవడం చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు టిల్లు గాడు నిన్ను పూర్తిగా మార్చేశాడంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.