ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు నటి అనుపమ పరమేశ్వరన్.ఈమె నటించిన రౌడీ బాయ్స్, కార్తికేయ 2 సినిమాలు మంచి హిట్ కావడంతో వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనుపమ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈమె జీవితంలో ఎలా సంతోషంగా బ్రతకాలని జీవిత పాఠాలను తెలియజేశారు.మన జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే మనం సానుకూల ఆలోచనలతో ఉండాలని అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుందని ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరం జీవితం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పారు.
జీవితంలో సంతోషంగా ఉండడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సి ఉంటుందని ఈమె తెలిపారు.
జీవితంలో మనం సంతోషంగా ఎలా ఉండాలి అనేది మన చేతుల్లోనే ఉంటుందని ఆ సంతోషాన్ని మనమే సృష్టించుకోవాలని బోధన చేశారు.
మనకు నచ్చిన 99 వస్తువులు దొరికి ఒక వస్తువు దొరకకపోతే బాధపడటంలో అర్థం లేదని, దొరికిన వాటితో తృప్తిపడటంలోనే అసలైన సంతోషం ఉందని, లేని వాటి గురించి బాధపడుతూ ఆలోచిస్తూ కూర్చోవడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా ఈమె ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక అనుపమ సినిమాల విషయానికి వస్తే ఈమె నిఖిల్ సరసన 18 పేజేస్, బటర్ ఫ్లై వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
.






