అ ఆ సినిమాలో నెగిటివ్ రోల్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్.చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల్లో అనుపమకు వచ్చిన గుర్తింపు అంతాఇంతా కాదు.
ప్రస్తుతం అనుపమ నిఖిల్ కు జోడీగా 18 పేజెస్ అనే సినిమాలో నటిస్తోంది.సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో అనుపమ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
మలయాళం తెరకెక్కిన ప్రేమమ్ సినిమాతో తన సినిమా కెరీర్ మొదలైందని.ఆ సినిమా హిట్ కావడంతో పాటు తన పాత్రకు మంచి పేరు వచ్చిందని చెప్పారు.అయితే ఆ సమయంలో తాను ప్రమోషన్లలో తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటున్నట్టు కొందరు ప్రచారం చేశారని.మరికొందరు తనకు అహంకారం ఎక్కువ అని కామెంట్లు చేశారని దీంతో కొంతకాలం మలయాళ ఇండస్ట్రీకి కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

ఆ తరువాత తెలుగు, తమిళ భాషలపై తాను దృష్టి పెట్టానని అఆ సినిమాలో అవకాశం రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయాణం మొదలైందని అన్నారు.మొదట ఆ పాత్రలో నటించవద్దని కొందరు సూచించారని అన్నారు.అయితే తనకు కూడా కమిట్మెంట్ల గోల ఎదురైందంటూ అనుపమ సంచలన వ్యాఖ్యలు చేశారు.సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి సాధారణమే అని అన్నారు.అనుమత క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అనుపమకు అవకాశాలు తగ్గాయి.
18 పేజెస్ సినిమాపై అనుపమ ఆశ పెట్టుకుంది.ఈ సినిమా హిట్టైతే మాత్రమే అనుపమకు కొత్త సినిమా ఛాన్సులు రావచ్చు.అందం, అభినయం పుష్కలంగా ఉన్నా అనుపమను స్టార్ హీరోలు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.18 పేజెస్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.