Anupama Parameswaran : అనుపమ ఏంటి ఇలా రెడీ అయ్యింది.. అవకాశాలు లేక ఆ పని చేస్తుందా?

టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ( Anupama Parameswaran ) తన అందంతో, నవ్వుతో ఎంతో మంది కుర్రాళ్ళు మనసులను దోచుకుంది.నటన పరంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మంచి క్రేజ్ సంపాదించుకుంది.

 Anupama Is Ready Like This Are There Any Opportunities Or Will It Work Tollywoo-TeluguStop.com

ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషలో కూడా నటించి అందరిని అభిమానులుగా మార్చుకుంది.ఇదంతా పక్కన పెడితే ఈ బ్యూటీ పని మనిషి లాగా రెడీ అవ్వటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇంతకూ అసలేం జరిగిందో తెలుసుకుందాం.

అను తొలిసారిగా మలయాళం ప్రేమమ్ ( Premam )సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాగా.తాను నటించిన శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమకోసమే వంటి సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అంతే కాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఇక ఆ మధ్య వరుస సక్సెస్ లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది అనుపమ.గత ఏడాది విడుదలైన కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలు తనకు మంచి సక్సెస్ ను తెచ్చిపెట్టాయి.దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది అని చెప్పవచ్చు.

సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది అనుపమ.తనకు సంబంధించిన ఫోటోలను, ఫన్నీ వీడియోలు బాగా పంచుకుంటుంది.

నిజానికి ఆమె షేర్ చేసే ఫన్నీ వీడియోల వల్ల అల్లరి పిల్లగా పేరు సంపాదించుకుంది.ఇందులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.తన సోదరుడితో కలిసి ఆట పట్టిస్తున్న వీడియోలను, అంతే కాకుండా తన సినిమా షూటింగ్ సమయంలో చేసిన వీడియోలను బాగా పంచుకుంది.అప్పుడప్పుడు అందంగా రెడీ అవుతూ కుర్రాళ్ళ మనసులు దోచుకుంటుంది.

సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.ఈమె ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే అది క్షణాల్లో వైరల్ అవుతుంది.ఖాళీ సమయం దొరుకుతే తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.ఇక ఈ బ్యూటీ కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ కూడా తెలుగులో చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటుంది.

అలా ప్రతి విషయంలో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.కుర్రాళ్లంతా ఈ బ్యూటీ ని క్రష్ లిస్ట్ లోకి చేర్చుకున్నారు.అలా తన విషయంలో బాగా క్రష్ చూపిస్తూ ఉంటారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఇంస్టాగ్రామ్( Instagram) లో ఒక ఫోటో పంచుకుంది.

అందులో తను మంచి స్టైలిష్ లుక్ లో కనిపించగా.చేతిలో చీపురు పట్టుకొని నిలబడింది.

దీంతో ఆ ఫోటోలు చూసిన తన ఫ్యాన్స్.అయ్యో నీకు ఎంత కష్టం వచ్చింది.

అడ్రస్ చెప్పు మేము వచ్చి క్లీన్ చేస్తాము అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరికొంతమంది అయ్యో అనుపమకు సినిమాలలో అవకాశాలు రావట్లేదా.

అందుకే చేతిలో చీపురు పట్టుకొని పనిచేస్తుందా అని సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube