దేశంలో ఎంతోమంది విద్యార్థులు ఐఏఎస్ కావాలనే కలను నెరవేర్చుకోవడం కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారు.కొంతమంది ఆలస్యంగానైనా కలను నెరవేర్చుకుంటే మరి కొందరు మాత్రం కలను నెరవేర్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఐఏఎస్ కావాలని అనుకున్న అనుభవ్ ధూబే ఆ కలను నెరవేర్చుకోలేకపోయినా తన తెలివితేటలతో టీ అమ్ముతూ 150 కోట్ల రూపాయలు సంపాదించారు.23 సంవత్సరాల వయస్సు ఉన్న అనుభవ్ ( Anubhav dube )ఐఏఎస్ డ్రీమ్స్ ఫెయిల్ కావడంతో వ్యాపారవేత్తగా మారాడు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా అనే ప్రాంతానికి చెందిన అనుభవ్ దూబేకు ఆనంద్ నాయక్ అనే మంచి స్నేహితుడు ఉన్నాడు.అనుభవ్ తండ్రి బిజినెస్ మేన్ కాగా తన కొడుకు ఐఏఎస్ అయితే బాగుంటుందని ఆయన భావించారు.
అయితే సీఏ, యూపీఎస్సీ పరీక్షల్లో ఫెయిల్ అయిన అనుభవ్ తండ్రి కలను నెరవేర్చలేకపోయారు.

చాయ్ సుత్తా బార్( Chai Sutta Ba ) అనే కంపెనీకి కో ఫౌండర్ గా మారిన అనుభవ్ అయిదు సంవత్సరాలలో ఆ కంపెనీని 3 లక్షల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ కు ఎదిగేలా చేశారు.ఆనంద్ నాయక్( Anand Naik ) తో కలిసి కేవలం రూ.3 లక్షలతో అమ్మాయిల హాస్టల్ ఎదురుగా తొలి అవుట్ లెట్ ను అనుభవ్ మొదలుపెట్టారు.ప్రస్తుతం దేశంలోని 195 నగరాలలో చాయ్ సుత్తా బార్ ఉండటం గమనార్హం.

ఈ సంస్థ వార్షిక విలువ 150 కోట్ల రూపాయలు కాగా అనుభవ్ నికర విలువ 10 కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది.చాయ్ సుత్తాబార్ లో మట్టికప్పులు, కుల్హాద్ లను ఉపయోగిస్తారు.చాయ్ సుత్తా బార్ లో ప్రస్తుతం 150 మందికి పైగా పని చేస్తున్నారు.
వీళ్లలో ఇంజనీర్లు, ఎంబీఏ చదివిన వారు కూడా ఉన్నారు.ఎన్నో ఇబ్బందులు ఎదురైనా అనుభవ్ తన ప్రతిభతో వ్యాపారంలో సక్సెస్ సాధించారు.
తన సక్సెస్ తో అనుభవ్ దూబే ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.