సినిమా ఇండస్ట్రీ( Film Inudstry ) లక్ పైన ఆధార పడి ఉంటుంది అనే విషయం అందరికి తెలుసు.ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఆ హీరో లేదా హీరోయిన్ కి వరస పెట్టి అవకాశాలు ఇస్తారు.
కానీ అదే నటుడికి ఒక్క ప్లాప్ వస్తే చాలు పట్టించుకునే వారే ఉండరు.అలాటి దారుణమైన పరిశ్రమలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదికి పైగా సినిమాలు పరాజయం పాలైన కూడా ఇండస్ట్రీ లో కొనసాగుతున్న హీరోయిన్ కూడా ఉంది.
పైగా ఆమె నటించిన అన్ని సినిమాలు ప్లాప్ అవుతున్న, ఒక్క విజయం నమోదు కాకాకపోయిన కూడా ఆమెకు మళ్లి అవకాశాలు వస్తూనే ఉన్నాయ్.ఆ సీక్రెట్ ఏంటో తెలియక సినిమా పరిశ్రమ నుంచి చాల మంది తెరమరుగు అయిపోతూ ఉంటారు.

ఇంతకు ఇన్ని పరాజయాలు మూటగట్టుకున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా ? ఆమె మరెవరో కాదు మలయాళీ ముద్దు గుమ్మా అను ఎమ్మాన్యుయేల్.( Anu Emmanuel ) స్వప్న సంచారి అనే మలయాళ సినిమా లో మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అను ఎమ్మాన్యుయేల్, ఆ తర్వాత యాక్షన్ హీరో బిజూ అనే సినిమాలో హీరోయిన్ గా కూడా అక్కడే నటించింది.ఆ తర్వాత తెలుగు లో మజ్ను సినిమా( Majnu ) ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా యావరేజ్ టాక్ తో నడిచినప్పటికీ అను కి మాత్రం ఇండస్ట్రీ బాగానే అవకాశాలను ఇచ్చింది.

కెరీర్ మొత్తం మీద ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టకుండా ఏకంగా పది తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా కనిపించింది.2 మలయాళ సినిమాలు 2 తమిళ్ సినిమాలు చేసిన అను కెరీర్ దారుణమైన డిజాస్టర్ ఫలితాలను కూడా చూసింది.ఇక అను ఎమ్మాన్యుయేల్ బాధితుల లిస్ట్ లో చివరి సినిమా రావణాసుర( Ravanasura ) కూడా చేరింది.ఈ సినిమా కూడా పరాజయం పాలవ్వడం తో ప్రస్తుతం తెలుగు లో ఇంకా ఏమైనా సినిమాలు చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉండగా, తమిళ్ లో మాత్రం జపాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
చిన్నతనం నటి కావాలని అనుకున్న అను ఎమ్మాన్యుయేల్ కెరీర్ ఇలాంటి దారుణ పరాజయాలతో కొనసాగుత్న్న ఆమెకు తమిళ్ వాళ్ళు బాగానే పిలిచి అవకాశాలు ఇస్తున్నారు.







