రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు ( Akkineni Nageshwar rao ) అంటే తెలియని వారు ఉండరు.ఆయన సినిమా ఇండస్ట్రీకి దొరికిన ఒక వరమని చెప్పుకోవచ్చు.
తన సినిమాలతో ఎంతోమందిని మెప్పించి సినీ ఇండస్ట్రీకి తనవంతుగా సహాయం చేసి కొత్త కొత్త వారిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసి ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చారని చెప్పుకోవచ్చు.అయితే అలాంటి ఏఎన్నార్ గారు ప్రస్తుతం మన ముందు లేకపోయినప్పటికీ ఆయన వారసత్వం మాత్రం ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది.
ఇక ఏఎన్ఆర్ అన్నపూర్ణ స్టూడియో ద్వారా ఎంతో మంది కొత్త వారికి నాగార్జున ( Nagarjuna ) అవకాశం ఇస్తూనే ఉన్నారు.
ఇదిలా ఉంటే ఏఎన్ఆర్ ( Anr ) బతికున్న సమయంలో తన ఇంట్లో వాళ్లతో గొడవ పెట్టుకొని మరీ ఆ హీరోకి 100 కోట్ల ఆస్తిని రాసిచ్చారట.
మరి ఇంతకీ ఆ హీరో ఎవరు.ఎందుకు ఏఎన్ఆర్ 100 కోట్ల ఆస్తిని రాసిచ్చారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ఏఎన్ఆర్ మనవడిగా నాగార్జున మేనల్లుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో సుమంత్ అందరికీ తెలిసే ఉంటారు.ఈయన ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నప్పటికీ అప్పట్లో మంచి హీరో.
మొదట ప్రేమకథా సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ ఆ తర్వాత చెప్పుకోదగిన సినిమాలేవి చేయలేదు.
ఇక ఈయన సత్యం ( Sathyam ) వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించినప్పటికీ జనరేషన్ కి తగ్గట్టు కథలు ఎంచుకోలేక హీరోగా వెనకబడ్డారని చెప్పవచ్చు.అయితే సుమంత్ పుట్టినప్పటి నుండి ఏఎన్ఆర్ దగ్గరే పెరగడంతో సుమంత్ పేరెంట్స్ కూడా ఏఎన్ఆర్ దగ్గరే సుమంత్ ని వదిలిపెట్టి వాళ్ళు విదేశాలకు వెళ్లారట.అయితే సుమంత్ సినిమాల్లో హీరోగా కొనసాగుతున్న సమయంలోనే కీర్తి రెడ్డి ( Keerthy reddy ) తో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి ఇద్దరు ఇరుకుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నప్పటికీ కలిసి ఉండలేకపోయారు.
దాంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
అయితే సుమంత్ సినిమాలో సక్సెస్ అవ్వక వైవాహిక జీవితంలో కూడా సక్సెస్ అవ్వకపోవడంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లారట.అయితే ఆ సమయంలో సుమంత్ ( Sumanth ) ని గమనించిన ఏఎన్ఆర్ తన మనవడి పరిస్థితి ఏమైపోతుందో నని అలోచించి ఇంట్లో వాళ్లకి తెలియకుండా బంజారాహిల్స్ లో తన పేరు మీదున్న ఏఎన్నార్ సెంటర్ ని సుమంత్ కి రాసిచ్చేశారట.అయితే ఆ తర్వాత ఇంట్లో వాళ్లకి ఈ విషయం తెలిసి గొడవ పెట్టినా కూడా ఎవరు ఏమనుకున్నా నా నిర్ణయం ఇదే అని తెగేసి చెప్పారట.
ప్రస్తుతం ఏఎన్ఆర్ తన మనవడు సుమంత్ కి రాసిచ్చిన ఆ ఆస్తి విలువ 100 కోట్లకు పైగానే ఉందని తెలుస్తోంది.