తెలుగు చిత్ర పరిశ్రమకు దివంగత నటులు ఎన్టీఆర్ ( NTR )ఏఎన్నార్ ( ANR ) రెండు కళ్ళు లాంటివారు అని చెబుతారు.హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇలా ఇండస్ట్రీని తమ నటనతో ముందుకు నడిపించినటువంటి ఎన్టీఆర్ ఏఎన్నార్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.ఎన్టీఆర్ కెరియర్ మధ్యలోనే రాజకీయాలలోకి వెళ్లారు కానీ ఏఎన్ఆర్ మాత్రం తన చివరి శ్వాస వరకు కళామతల్లికి సేవలు చేస్తూనే వచ్చారు.
ఈ విధంగా ఏఎన్ఆర్ దాదాపు 7 దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీకి సేవలు చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక ఏఎన్ఆర్ చివరిగా తన కుటుంబ సభ్యులందరూ కలిసి నటించిన మనం సినిమా( Manam Movie ) లో నటించారు.ఈ సినిమా అక్కినేని కుటుంబానికి ఎప్పటికీ ఒక తీయ్యని జ్ఞాపకం అని చెప్పాలి.ఈ సినిమా తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడవడం అనంతరం ఆయన మరణించడం జరిగింది.
ఇక తాజాగా ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి.అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున ( Nagarjuna ) ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరింప చేసి ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఏఎన్నార్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.సినిమాలలో నటిస్తూ ఎన్నో ఆస్తులను కూడా పెట్టడమే కాకుండా నిర్మాతగా మారడం అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడం వంటి ఉన్నత స్థానానికి ఏఎన్ఆర్ చేరుకున్నారు.ఇలా సినిమాలలో కొనసాగుతూనే భారీగా సంపాదించినటువంటి ఏఎన్ఆర్ కెరియర్ మొదట్లో ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు ఈయన మొదటి సంపాదన ఎంత అనే విషయానికి వస్తే…
ఏఎన్ఆర్ సినిమాలలోకి రాకముందు రంగస్థలం నాటకంలో కొన్ని పాత్రలలో నటించే వారట ఇలా నటించినందుకుగాను ఆయనకు 50 పైసలు ఇచ్చేవారని తెలుస్తోంది.50 పైసలు అంటే అర్ధరూపాయి.ఇప్పటి కాలం వారికి అర్ధరూపాయి ఎలా ఉంటుందో కూడా తెలియదు కానీ అప్పట్లో ఇదే చాలా పెద్ద మొత్తంలో డబ్బు అని చెప్పాలి.ఇలా రంగస్థలం నటుడిగా కొనసాగుతున్నటువంటి ఈయన అనంతరం సినిమాలలోకి వచ్చారు .ఇలా సినిమాలలోకి వచ్చిన తరువాత మొదట్లో తన పాత్రలకు అనుగుణంగా ఐదు రూపాయలు పది రూపాయలు అలా రెమ్యూనరేషన్ పెరుగుతూ వచ్చింది.
ఈ విధంగా నాగేశ్వరరావు( Akkineni nageshwara rao ) మాత్రం నటనపరంగా తన మొదటి సంపాదన కేవలం అర్ధరూపాయి అని చెప్పాలి.అయితే తన మొదటి సంపాదనతో నాగేశ్వరరావు గారు ఏం చేశారు అనే విషయానికి వస్తే తాను కష్టపడి సంపాదించిన ఆ మొదటి అర్ధ రూపాయిని ఆయన చాలా అపురూపంగా భావించడమే కాకుండా ఆ డబ్బును ఎంతో గౌరవించారట.ఆ అర్ధరూపాయని ఏఎన్ఆర్ చాలా భద్రంగా దాచుకున్నారని ఇప్పటికీ ఆ అర్ధరూపాయి నాగార్జున వద్ద భద్రంగా ఉందని తెలుస్తోంది.
నాగేశ్వరరావు పెద్దగా ఆడంబరాలకు పోకుండా వచ్చిన దాంట్లోనే తన ఖర్చులన్నీ పోను డబ్బును పోగు చేసేవారట.ఇలా పోగు చేసిన ఆ డబ్బే ఇప్పుడు నాగార్జునకు ఆయన పిల్లలకు కొన్ని వేల కోట్ల ఆస్తి అయిందని చెప్పాలి.
డబ్బుకు ఎప్పుడు గౌరవం ఇవ్వాలి అని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండేవారిని పలువురు సెలబ్రిటీలు ఈ విషయాన్ని వెల్లడించారు.