తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ది మ్యాన్ టు ది నెక్స్ట్ డోర్ ఇమేజ్ ఉన్న నటులు చాల తక్కువ మంది ఉన్నారు.ఒకప్పుడు రాళ్ళపల్లి, పి.
ఎల్.నారాయణ, తనికెళ్ళ భరణి వంటి వారు ఎంతో చక్కగా సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో నటించే వారు.ఒక తరం గడిచిపోయింది.రాళ్ల పల్లి, నారాయణ వంటి నటులు కాలం చేసారు.తనికెళ్ళ భరణి( Tanikella Bharani ) ఉన్నప్పటికి సినిమాల్లో అడపా దడపా మాత్రమే కనిపిస్తున్నారు.అందుకే అలాంటి నటులు ఈ మధ్య కాలంలో ఎక్కడ తారస పడటం లేదు.
సినిమా పద్ధతి మారుతున్న ఈ తరుణంలో అలాంటి నటులకు మంచి సన్నివేశాలను సృష్టించ లేకపోతున్నారు ఇప్పటి దర్శకులు.

పైగా మంచి కమెడియన్స్ గా కూడా చాల మంది నటులకు స్వచ్ఛమైన కామెడి చేయించ లేకపోతున్నారు.ఇక ఈ మధ్య కాలం లో ఎక్కడ చుసిన అలాంటి నటుల స్థానాన్ని భర్తీ చేసే వారు కూడా కనిపించడం లేదు కానీ ఇప్పిడిప్పుడే ఒక నటుడు అలాంటి కెపాసిటీ తో కనిపిస్తన్నాడు.అతడి పేరు మురళీధర్ గౌడ్.
( Actor Muralidhar Goud ) డి జె టిల్లు సినిమాలో సిద్దు జొన్నలగడ్డ కు తండ్రి పాత్రలో నటించాడు.ఈయన్ని వాడుకోవాలే కానీ మంచి ఆణిముత్యం అవ్వగలడు.
ఈ మధ్య కాలంలో మంచి సినిమాల్లో కనిపిస్తున్నాడు.బలగం,( Balagam ) పరేషాన్ ( Pareshan ) వంటి చిత్రాలు అయన నటనను, స్థాయిని పెంచేవి అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

ఇక మురళీధర్ గౌడ్ లో ఉండే మరొక గొప్ప విషయం ఏమిటి అంటే అయన గొంతును ఎవరు ఇమిటేట్ చేయలేరు.చక్కటి డైలాగ్ డెలివరీ మంచి మాడ్యులేషన్ అయన సొంతం.ప్రతి సీన్ లో అటెన్షన్ మొత్తం తన పైకి తిప్పుకోగల నటుడు.‘డీజే టిల్లు’తో మొదలై ‘బలగం’తో ఆయన ప్రతిభ అందరికీ తెలిసింది.‘పరేషాన్’ ఆయన నటనకు మరో గీటురాయి.ఇలాంటి నటులే తెలుగు సినిమా ఇండస్ట్రీ కి కావలి.
అడ్డదిడ్డంగా బాడీ లాంగ్వేజ్ తో అర్ధం కానీ డైలాగ్స్ తో జనాలను చంపే నటుల కన్నా కూడా మురళీధర్ లాంటి నటులు చాల బెటర్.కాస్త లేట్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ వెళ్తున్న మురళీధర్ గౌడ్ మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలని ఆశిద్దాం.