ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిన కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరామ్ కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
శివరామ్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పోలీసులు హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు.అయితే సరైన ఆధారాలు లేవని శివరామ్ కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ చిక్కడపల్లి పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేశారు.దీంతో నాంపల్లి కోర్టు శివరామ్ కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే శివరామ్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు.