బీజేపీకి ఎదురైన మరో కఠిన పరీక్ష...ఎదుర్కొనేనా?

తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్క సారిగా ఆసక్తికర పరిణామాలతో మారిపోతున్న పరిస్థితి ఉంది.

ఇక వచ్చే యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేది లేదని ఇప్పటికే ప్రకటించిన కెసీఆర్ అలాగే రైతులకు కూడా వరిని మినహాయించి వేరే పంటలపై దృష్టి పెట్టాలని ఇప్పటికే రైతులకు సూచించినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది.

చాలా మంది రైతులు వేరే పంటల సాగుకై మొగ్గు చూపకుండా మళ్ళీ వరి ధాన్యాన్ని సాగు చేసిన పరిస్థితి ఉంది.అయితే ఇక ఎట్టకేలకు పంట కోతకు వచ్చే సమయం అసన్నమైనందున ఇక వరి ధాన్యం నిల్వలు అనేవి ప్రారంభమైనవని చెప్పవచ్చు.

అయితే ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయమని ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం వద్దన్నందుకే రైతులకు వరి పంట సాగు చేయాలని తెలియజేశామని కావున ఇప్పుడు పంజాబ్ తరహాలో పూర్తి ధాన్యాన్ని తెలంగాణలో కూడా కొనుగోలు చేయాలంటూ నిరసనలకు, ధర్నాలకు రూపకల్పన చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇటీవల బండి సంజయ్ రైతులు వరి పంటను పండించండి ప్రభుత్వం ఎట్ల కొనదో చూస్తాం అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలే ఇప్పుడు బీజేపీకి కఠిన పరీక్షగా మారబోతున్నాయి.

అయితే క్రితం సారి రాష్ట్ర ప్రభుత్వం మీద నింద వేయాలని ప్రయత్నం చేసినా ఈసారి అలా కుదిరేలా కనిపించడం లేదు.ఎందుకంటే కేంద్రం ఈ ఒక్కసారి మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో ప్రస్తుత కొనుగోలుపై ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది .ఒకవేళ కొనుగోలు చేయకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్రం లో బీజేపీకి రైతులలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.అయితే టీఆర్ఎస్ ధర్నాలపై బీజేపీ ఇంకా స్పందించకున్నా రానున్న రోజుల్లో ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.

Advertisement
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు