కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది.పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు.
జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ అన్ని పదవులకు రాజీనామా చేశారు.ప్రజా ప్రయోజనాల కోసం పార్టీ పాటుపడే పరిస్థితి కనిపించడం లేదని, అందుకే పార్టీని వీడినట్లు చెప్పారు.
సంవత్సర కాలంగా సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకా గాంధీల సమయం కోరుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.పార్టీ అధిష్టానం అంతా భజనపరుల కోటరీగా మారిందని ఆరోపించారు.
అధిష్టానం అడుగులకు మడుగులొత్తే వారికి మాత్రమే అందలాలు దక్కుతున్నాయని, పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి విలువ లేదని వాపోయారు.