కొండగట్టుకు మరో రూ.500 కోట్ల నిధులు.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది.ఈ సందర్భంగా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

 Another Rs. 500 Crore Funds For Kondagattu.. Cm Kcr's Key Announcement-TeluguStop.com

కొండగట్టు అభివృద్ధికి అదనంగా మరో రూ.500 కోట్ల నిధులను మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.ఇప్పటికే ఆలయ అభివృద్ధికి బడ్జెట్ లో రూ.100 కోట్ల నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే.

కొండగట్టు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్ పై సమీక్ష నిర్వహించారు.దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం కొండగట్టు కావాలని కేసీఆర్ తెలిపారు.

యావత్ ప్రపంచాన్ని ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలని చెప్పారు.ఈ మేరకు సుమారు 850 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు జరగాలని అధికారులను ఆదేశించారు.

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి బృహత్తర ప్రాజెక్ట్ అన్న సీఎం భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube