సుప్రీంకోర్టులో అమరావతి రైతుల మరో పిటిషన్

రాజధాని అమరావతి రైతులు భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఆర్ -5 జోన్ వ్యవహారంలో స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది.

 Another Petition Of Amaravati Farmers In The Supreme Court-TeluguStop.com

దీంతో అమరావతి రైతులు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో రైతుల పిటిషన్ పై ఈనెల 14న విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.

అయితే రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేదలకు అయినా రాజధానిలో 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ ఆర్ -5 జోన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

కాగా జోన్ -5 ఏర్పాటుపై స్టే విధించాలని రైతులు హైకోర్టులో పిటిషన్ వేయగా.ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం తిరస్కరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube