ఖమ్మం జిల్లాలో మరో సూది హత్య..!

ఖమ్మం జిల్లాలో మరో ఇంజెక్షన్ హత్య వెలుగులోకి వచ్చింది.కట్టుకున్న భర్తే భార్యను కడతేర్చాడు.

 Another Needle Murder In Khammam District..!-TeluguStop.com

ఆస్పత్రిలో బాలింతగా ఉన్న భార్యకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడు.ఖమ్మం రూరల్ పెద్దతండాకు చెందిన భిక్షం భార్యను ప్రసవం కోసం ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

అక్కడ ఆమెకు ఎక్కించే సెలైన్ లో మత్తు ఇంజెక్షన్ వేశాడు.దీంతో ఆమె మృతిచెందింది.

ఈ నేపథ్యంలో ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య చనిపోయిందని నాటకం ఆడాడు.సీసీ కెమెరాలు పరిశీలించిన వైద్యులు.

అసలు విషయం బయటపడటంతో పోలీసులకు సమాచారం అందించారు.నిందితుడు ల్యాబ్ టెక్నిషియన్‎గా పనిచేస్తున్నట్టు సమాచారం.

ఇటీవలే జిల్లాలో బైకు లిఫ్ట్ అడిగి ఓ వ్యక్తికి ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసిన విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube