సూపర్ స్టార్ మహేష్( Mahesh babu ) తో సినిమా చేయాలని అనుకున్న సుకుమార్ మహేష్ కి కథ చెప్పి ఒప్పించడంలో విఫలమవగా ఆయన పర్మిషన్ లేకుండానే సుకుమార్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.ఆ సినిమానే పుష్ప.
అల్లు అర్జున్( Allu arjun ) పుష్ప రాజ్ గా ఆడేసుకున్నాడు.అయితే పుష్ప సినిమా మహేష్ చేసి ఉంటే మాత్రం ఊహించడం కష్టం.
మహేష్ కి చెప్పింది వేరే కథ అయితే మాత్రం సుకుమార్ మీద నమ్మకం పెట్టాల్సింది అనుకోవచ్చు.ఇక ఇదిలాఉంటే లేటెస్ట్ గా మహేష్ కోసం అనుకున్న మరో కథను అల్లు అర్జున్ తో చేసేందుకు సిద్ధమయ్యాడట.
అదేంటి అనుకోవచ్చు.మహేష్ తో సందీప్ వంగ( Sandeep Vanga ) సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి.ఆ సినిమాకు షుగర్ ఫ్యాక్టరీ అనే టైటిల్ కూడా పెట్టారని టాక్ వచ్చింది.కానీ మహేష్ తో కాకుండా రీసెంట్ గా అల్లు అర్జున్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు అల్లు అర్జున్.
సో ఇక్కడ కూడా మహేష్ కాదన్న కథతోనే అల్లు అర్జున్ సినిమా చేస్తాడా అని డౌట్ పడుతున్నారు.మొత్తానికి మహేష్ అల్లు అర్జున్ ఈ కథల మార్పిడి భలే అనిపిస్తుంది.