చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ మరో వినూత్న నిరసన

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పార్టీ మరో వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టింది.ఈ మేరకు ‘న్యాయానికి సంకెళ్లు’ పేరుతో కొత్త ఆందోళనకు నారా లోకేశ్ పిలుపునిచ్చారు.

 Another Innovative Protest By Tdp To Protest The Arrest Of Chandrababu-TeluguStop.com

రేపు సాయంత్రం 7 గంటల నుంచి దాదాపు ఐదు నిమిషాల పాటు చేతులకు తాడు లేదా రిబ్బన్ కట్టుకుని నిరసన వ్యక్తం చేయాలని లోకేశ్ తెలిపారు.తరువాత నిరసన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవాలని సూచించారు.

చంద్రబాబు ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని కోరిన లోకేశ్ జగన్ నియంతృత్వ పోకడలు దేశమంతా తెలిసే విధంగా చేయాలని పిలుపునిచ్చారు.అయితే చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఇప్పటికే ఆలయాల్లో పూజలు, టార్చిలైట్ తో నిరసన, బాబుతో నేను, మోత మోగిద్దాం వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ తాజాగా మరో నిరసన కార్యక్రమం చేపట్టనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube