' మార్గదర్శి' కి మరో మంట ! జగన్ ఏం చేశారంటే ?

తన పైన తమ ప్రభుత్వం పైన నిత్యం వ్యతిరేక కథనాలతో తమ పత్రిక, ఛానెల్ ద్వారా  విరుచుకుపడుతున్న ఈనాడు గ్రూప్ సంస్థలపై జగన్( Jagan ) సీరియస్ గానే దృష్టి సారించారు.

ఆ సంస్థలో భాగంగా ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారాలపై గత కొద్దిరోజులుగా వైసిపి అధినేత , ఏపీ సీఎం జగన్ ఫోకస్ పెట్టారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్స్( Margadarshi Chit Funds ) కార్యాలయాలపై పెద్ద ఎత్తున అధికారులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శిలో చిట్టిల వ్యవహారం జరుగుతున్నట్లుగా అధికారులు నిగ్గు తేల్చారు.

అలాగే వివిధ బ్రాంచ్ ల మేనేజర్లను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు పంపించారు.మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో ఏ 1 గా రామోజీరావును, ఏ2 గా ఆయన కోడలు శైలజను చేర్చారు.

ఇప్పటికే మార్గదర్శి అక్రమాల కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.అంతేకాదు మార్గదర్శి కార్యాలయాలు నిర్వహించిన దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు చోటు చేసుకున్నట్లు మరిన్ని ఆధారాలు దొరికితే సంస్థను మూసివేస్తామని స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ( Registration Department ) అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు.తాజాగా ఇప్పుడు మార్గదర్శి అక్రమాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement

ఈ సంస్థలో నెలకొన్న అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు మార్గదర్శి లో ప్రత్యేక ఆడిటింగ్ కోసం స్పెషల్ ఆడిటర్ ను ప్రభుత్వం తాజాగా నియమించింది.మార్గదర్శిలో నిధుల మళ్లింపు , అక్రమ డిపాజిట్ల సేకరణ తదితర అంశాలపై సమగ్రంగా వివరాలు రాబట్టేందుకు ఈ స్పెషల్ ఆడిటర్ నియామకం చేసినట్లు తెలుస్తోంది.

మార్గదర్శి కి చెందిన 37 బ్రాంచ్ లలో ఆడిటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.అయితే మార్గదర్శి అక్రమాలకు ఎవరు ఫిర్యాదు చేయకపోయినా,  ప్రభుత్వమే  దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టింది.ఈ వ్యవహారం రాజకీయంగాను ముడిపడి ఉండడంతో ఈ విషయంలో ఏం జరుగుతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు