ప్రాణాలు తీస్తున్న మరో ప్రమాదకరమైన ఆన్‌లైన్ గేమ్

ఇటీవల కాలంలో సెల్ ఫోన్ వినియోగం పెరిగాక దాని వల్ల అనర్ధాలు కూడా అంతే స్థాయలో ఉన్నాయి.పబ్ జీ మొబైల్ గేమ్ వల్ల ఎంతో మంది చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు.

 Another Dangerous Online Game That Is Taking Lives, Online Gameing, Life's, Boy-TeluguStop.com

ఇటువంటి ప్రాణాంతక యాప్‌లను నిషేధించాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వచ్చాయి.వాటికి కేంద్రం కూడా తలొగ్గింది.

పబ్ జీ యాప్‌పై భారత్‌లో నిషేధం విధించింది.అయితే బ్యాటిల్ గ్రౌండ్ పేరుతో ఇది మరలా దేశంలో ప్రవేశించింది.

ఈ తరహా యాప్‌ల కారణంగా చాలా మంది చిన్నారులు ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు.ఆన్‌లైన్ గేమ్‌ల మాయలో పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

తమ ప్రాణాల మీదకు తీసుకొచ్చుకుంటున్నారు.తాజాగా ఓ సరికొత్త ఆన్‌లైన్ గేమ్ ఇదే తరహాలో సంచలనాలు రేకెత్తిస్తోంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో మైనర్‌ బాలుడిని 200 సార్లు కొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

మొబైల్ గేమ్‌లో ఓడిపోవడంతో షూస్‌తో అతడి ప్రత్యర్థులు కొట్టారని తెలుస్తోంది.బాలుడిని మిడ్నాపూర్ మెడికల్ కాలేజీలో చేర్చారు.ప్రస్తుతం అక్కడ అతను చికిత్స పొందుతున్నాడు.భిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పొటాష్‌పూర్ గ్రామంలో బుధవారం కొందరు మైనర్ బాలురు తమ ఇంటికి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో మొబైల్ గేమ్స్ ఆడుతున్నారు.ఇందులో ఓడిపోతే 200 సార్లు బూట్లతో కొట్టాలనే నిబంధన ఉంది.

అయితే ఈ గేమ్‌లో ఓడిపోయినందుకు ఓ మైనర్‌ను వారు బూట్లతో 200 సార్లు కొట్టారు.ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, మైనర్ బాలుడు అస్వస్థతకు గురయ్యాడు.

అతని ముక్కు నుండి రక్తస్రావం ప్రారంభమైంది.క్షతగాత్రుడిని తొలుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి పరిస్థితి విషమించడంతో మిడ్నాపూర్ మెడికల్ కాలేజీలో చేర్పించారు.

ఆ తర్వాత తల్లిదండ్రులకు మొబైల్ గేమ్ గురించి తోటివారిని అడిగి తెలుసుకున్నారు.దీంతో ఈ విషయాన్ని పోలీసులకు చేర వేశారు.

పేరు తెలియని ఆ గేమింగ్ యాప్ గురించి పోలసులు విచారణ ప్రారంభించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube