తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు ఎక్కువైపోయాయి.కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందడం తెలిసిందే.
ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వంపై(Telangana Governament) తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.నగరంలో రోజురోజుకీ చిన్నారులపై కుక్కల దాడి ఘటనలు ఎక్కువైపోతున్నాయి.
ఈ క్రమంలో కొంతమంది ప్రాణాలు కోల్పోతుంటే మరి కొంతమంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.ఇక ఇదే సమయంలో కుక్కల బెడద నివారణకు చర్యలు చేపట్టడానికి GHH అధికారులు ప్రకటనలు చేస్తున్నా గానీ.
వాస్తవ రూపం దాల్చకపోవడంతో నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఖమ్మం జిల్లా రఘునాధపాలెం(Khammam) మండలం పుటానీతండాకు చెందిన ఐదేళ్ల భరత్ పై ఆదివారం సాయంత్రం కుక్కలు దాడి(Dog Attacks) చేయడం జరిగింది.ఇంటి ముందు ఆడుకుంటుండగా… ఇష్టం వచ్చినట్లు కొరికి గాయపరిచాయి.దీంతో కూలీ పనులకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు… భరత్ ను ఖమ్మంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అయితే పరిస్థితి విషమించటంతో నేడు మెరుగైన వైద్యం కోసం ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ కు తీసుకొస్తుండగా మార్గ మధ్యలో భరత్ ప్రాణాలు విడవటం జరిగింది.దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.








