Madhu Mantena : యోగా టీచర్ ను పెళ్లి చేసుకున్న బడా నిర్మాత.. ఈ వయసులో అవసరమా అంటూ ట్రోల్స్?

ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రిటీలు లేటు వయసులో పెళ్లి చేసుకుని షాక్ ఇస్తున్నారు.మనవళ్లను ఎత్తుకోవాల్సిన వయసులో రెండవ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.50 ఏళ్లు 60 ఏళ్ల వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం అన్నది ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అయిపోయింది.దీంతో ఇటీవల ఇలా ఎక్కువ మంది సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకొని షాక్ ఇస్తున్నారు.

 Another Big Producer Madhu Mantena Who Is Going To Marry His Girlfriend-TeluguStop.com

పెళ్లి ఒక ఎత్తు అయితే అందులో వరుడు వయసుతో పోలిస్తే వధువు వయసు చాలా తక్కువగా ఉంటుంది.టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ( Dil raju )50 ఏళ్ల వయస్సులో తేజస్విని అనే యువతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Telugu Bollywood, Dil Raju, Ira Trivedi, Madhu Mantena, Tollywod-Movie

తాత అయ్యాక అతడు తండ్రి అయ్యాడు.ఇక మొన్నటికు మొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆశిష్ విద్యార్థి 57 వయస్సులో తన కన్నా వయస్సులో చాలా చిన్నదైన యువతిని వివాహం చేసుకొని షాక్ ఇచ్చాడు.అలాగే నటుడు ఫృద్వీ తన కన్నా వయస్సులో చిన్న అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు.ఇలా సెలబ్రిటీలు వరుసగా లేటు వయసులో పెళ్లిళ్లు చేసుకొని పెళ్లిళ్లకు వయసుతో సంబంధం లేదు అని నిరూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ నిర్మాత పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.టాలీవుడ్, బాలీవుడ్ బడా నిర్మాత అయిన మధు మంతెన( Madhu Mantena ) రెండవ పెళ్ళికి సిద్ధమయ్యాడు.

Telugu Bollywood, Dil Raju, Ira Trivedi, Madhu Mantena, Tollywod-Movie

ఆయన మొదటి భార్య, ప్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా ఈ ఏడాదిలోనే వివాహం చేసుకోవడం గమనార్హం.మసాబా ప్రముఖ నటి నీనా గుప్తా కుమార్తె.వీరిద్దరూ 2019లో విడిపోయారు.కాగా ప్రస్తుతం మధు మంతెనకు 48 ఏళ్లు.యోగా టీచర్, ప్రియురాలు ఐరా త్రివేదీ( Ira trivedi ) మెడలో తాజాగా మూడు ముళ్లు వేసాడు.ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముంబయిలో కోలాహలంగా సాగుతున్నాయి.

తాజాగా మెహంది ఫంక్షన్ గ్రాండ్​గా జరగగా అందుకే బాలీవుడ్ స్టార్​ అమీర్ ఖాన్, రాజ్‌కుమార్ రావు, హృతిక్​ రోషన్​, నిఖిల్ ద్వివేది తదితురులు హాజరై సందడి చేసారు.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలను చూసిన నెటిజెన్స్ మండిపడుతున్నారు.

తాత అవ్వాల్సిన వయసులో నీకు రెండవ పెళ్లి అవసరమా అంటూ నిర్మాత పై మండిపడుతున్నారు.ఇంకొందరు ఇలా తాతల వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం అన్నది సినిమా ఇండస్ట్రీలో ఫ్యాషన్ అయిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకొందరు మాత్రం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube