తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగుతోంది.ఈ క్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క యాత్ర షెడ్యూల్ ను పార్టీ ప్రకటించింది.
షెడ్యూల్ ప్రకారం ఈనెల 16వ తేదీ నుంచి జూన్ 15 వరకు 91 రోజులపాటు భట్టి పాదయాత్ర కొనసాగనుంది.కాగా బజార్ హత్నూర మండలం సిర్పి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.
మొత్తం 39 నియోజకవర్గాల్లో 1,365 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.







