మచిలీపట్నం లోక్ సభ అభ్యర్థి( Lok Sabha Candidate )ని జనసేన ప్రకటించింది.ఈ మేరకు మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి( Balashowry Vallabbhanen ) పేరును ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
టీడీపీ, బీజేపీతో పొత్తు నేపథ్యంలో జనసేన రెండు ఎంపీ స్థానాలతో పాటు 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ తాజాగా మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి పేరును ప్రకటించారు.