గత ఐదేళ్లలో టాలీవుడ్ సంక్రాంతి సినిమాల విజేతలు ఎవరో మీకు తెలుసా?

సినిమా పరిశ్రమలో సంక్రాంతి పండుగ అంటే ఒక పెద్ద పండుగ అని చెప్పవచ్చు.ఎందుకంటే చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు చాలా వరకు సినిమాలను సంక్రాంతి పండుగకి విడుదల చేస్తూ ఉంటారు.

 Sankranti Winners This Is The Track Of The Last Five Years Details, Sankranthi M-TeluguStop.com

ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు థియేటర్ల వద్ద సినిమాల జాతర మామూలుగా ఉండదు.చిన్న హీరోల నుంచి పెద్దపెద్ద అగ్ర హీరోల వరకు కూడా వారి సినిమాలను సంక్రాంతికి విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.

ఇకపోతే ఈ ఏడాది అనగా 2023 సంక్రాంతి పండుగకు కానుకగా బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదల అయి రెండు సూపర్ హిట్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే.అయితే ఈ సంక్రాంతికి మెగాస్టార్ అలాగే బాలకృష్ణ ఇద్దరు కూడా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

మరి గడిచిన ఐదేళ్లలో ఏ ఏ హీరోలు సంక్రాంతి బరిలో నిలిచారు? ఏ సినిమాలు అత్యధికంగా కలెక్షన్స్ ను సాధించాయి?ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Telugu Alludu Adhurs, Bangarraju, Krack, Red, Sankranthi, Tollywood-Movie

2019లో రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ, అలాగే వెంకటేష్ వరుణ్ తేజ్ లో నటించిన ఎఫ్2 సినిమాలు విడుదల అయ్యాయి.ఈ రెండు సినిమాలలో ఎఫ్2 సినిమా మంచి విజయం సాధించింది.2020లో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం లో సినిమా, మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా, కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురా సినిమాలు విడుదల అయ్యాయి.

Telugu Alludu Adhurs, Bangarraju, Krack, Red, Sankranthi, Tollywood-Movie

వీటిలో కళ్యాణ్ రామ్ సినిమా ఫ్లాప్ కావడంతో మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.2021లో రవితేజ నటించిన క్రాక్ సినిమా, రామ్ పోతినేని నటించిన రెడ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాలు విడుదల కాగా క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో మిగిలిన రెండు సినిమాలు పరవాలేదు అనిపించాయి.2022లో నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా, రౌడీ బాయ్స్ సినిమాలు విడుదల కాగా ఇందులో బంగార్రాజు సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube