Bigg Boss : బిగ్ బాస్ వల్ల విడాకులు తీసుకోబోతున్న స్టార్ కపుల్..!!

బిగ్ బాస్ (Bigg Boss) రియాల్టీ షో.ఈ షో కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా చాలా సీజన్లు కంప్లీట్ చేసుకుంది.

 Bigg Boss : బిగ్ బాస్ వల్ల విడాకులు త-TeluguStop.com

మరీ ముఖ్యంగా హిందీలో అయితే ఇది 17 వ సీజన్.అయితే ఈ బిగ్ బాస్ రియాల్టీ షో వల్ల ఇప్పటికే చాలా గందరగోళాలు జరిగి పోయాయి.

ఇక తెలుగులో అయితే బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) అభిమానుల కారణంగా ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయి.దాంతో ప్రశాంత్ ని అరెస్టు చేశారు.

అలాగే దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలి అని ఎన్ని పిటిషన్లు వేసినప్పటికీ కోర్టు దానిని పరిగణలోకి తీసుకోవడం లేదు.బిగ్ బాస్ ని బ్యాన్ చేయడం లేదు.

అయితే తాజాగా ఈ బిగ్ బాస్ షో వల్ల ఒక పచ్చని కాపురంలో చిచ్చు మొదలైందని తెలుస్తోంది.ఈ బిగ్ బాస్ షో వల్ల ఒక స్టార్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారట.

మరి వాళ్ళు ఎవరు.ఎందుకు విడాకులు తీసుకోబోతున్నారు అనేది.

ఇప్పుడు హిందీలో బిగ్ బాస్ సీజన్ 17 లో భార్యాభర్తలుగా అంకిత లోఖడే(Ankitha Lokhande) విక్కీ జైన్ లు కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు.అంకిత లొఖడే కొన్ని సీరియల్స్ ద్వారా పాపులర్ నటిగా పేరు తెచ్చుకుంది.

ఈమె దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కొన్ని రోజులు లవ్ ట్రాక్ నడిపి ఆ తర్వాత బిజినెస్ మాన్ అయినా విక్కీ జైన్ ని పెళ్లాడింది.అయితే వీళ్ళిద్దరూ హిందీలో కొనసాగుతున్న బిగ్ బాస్ 17 సీజన్ లో(Bigg Boss 17) పాల్గొన్నారు.

అయితే ఈ సీజన్లోకి ఏ ముహూర్తనా ఈ జంట అడుగు పెట్టారో కానీ వీళ్ళు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

Telugu Ankita Lokhande, Ankitalokhande, Bigg Boss, Bigg Boss Hindi, Biggbosss Hi

మరీ ముఖ్యంగా అంకితని హౌస్ లో ఉన్న అందరి ముందు తన భర్త విక్కీ జైన్ (Vicky Jain) ను అవమానించడం, చిన్న చూపు చూడడం తనకి అస్సలు నచ్చడం లేదు.దాంతో తన భర్త అలా చేయడం సహించని అంకిత లోఖడే నాకు డివోర్స్( Divorce ) కావాలి అని షో లోనే అడిగింది.దాంతో ఈ మేటర్ మొత్తం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాదు బిగ్ బాస్ ఒక జంటని విడదీస్తుంది అంటూ ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Telugu Ankita Lokhande, Ankitalokhande, Bigg Boss, Bigg Boss Hindi, Biggbosss Hi

ఇక వీళ్లిద్దరు మాత్రమే కాకుండా ఇప్పటికే బిగ్ బాస్ షో వల్ల చాలామంది ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి.గతంలో తెలుగులో కూడా షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) దీప్తి సునయన( Deepthi Sunaina ) విడిపోయిన సంగతి మనకు తెలిసిందే.అలాగే గీత మాధురి బిగ్ బాస్ వెళ్లి వచ్చాక తన భర్తకు విడాకులు ఇవ్వబోతుంది అని కూడా అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి.

ఇలా బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల చాలామందికి చాలా రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి.అందుకే ఈ షో ని బ్యాన్ చేయాలి అని చాలామంది భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube