వైరల్ వీడియో: పిజ్జాలు ఎలా తయారు చేస్తారో చూస్తే ఆశ్చర్యపోతారు..?

పిజ్జా( Pizza ) ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఫాస్ట్ ఫుడ్.చాలా మంది ఈ రుచికరమైన ఇటాలియన్ వంటకం తినేందుకు తెగ ఆరాటపడుతుంటారు.

 Viral Video: Will You Be Surprised To See How Pizzas Are Made, Viral Video, Lat-TeluguStop.com

సాధారణ మార్గరీటా నుంచి మాంసంతో కూడిన వాటి వరకు ప్రతి ఒక్కరి అభిరుచికి అనుగుణంగా వివిధ రకాల పిజ్జాలు అందుబాటులో ఉన్నాయి.చీజ్, సాస్‌తో కూడిన పిజ్జా స్లైస్ ఆహార ప్రియులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

అయితే పెద్ద పరిమాణంలో పిజ్జాలు ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా చూశారా? తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social media )లో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు లేదా అసహ్యంగా ఫీల్ అవ్వచ్చు.

ఒక ఇన్‌స్టాగ్రామ్( Instagram ) ఫుడ్ పేజీ ఒక ఫ్యాక్టరీలో పిజ్జా తయారీ ప్రక్రియను చూపించే ఓ క్లిప్‌ను పోస్ట్ చేసింది.అందులోని వర్కర్స్ పిజ్జా బేస్‌ పిండిని తయారు చేస్తారు.దానిలో చిన్న రంధ్రాలు వేయడానికి ఒక యంత్రాన్ని ఉపయోగిస్తారు.ఇది బేస్ సాస్, ఇంగ్రిడియంట్స్ గ్రహించడంలో సహాయపడుతుంది.తర్వాత ఒక మెషిన్ సాస్‌ను బేస్ మీద సమానంగా స్ప్రెడ్ చేస్తుంది.ఆపై , జున్ను కూడా డ్రాప్ చేస్తుంది.

తురిమిన జున్నును బేస్ మీద చల్లడం మనం వీడియోలో చూడవచ్చు.చీజ్‌తో కప్పబడిన పిజ్జాలు ఏదైనా ఎక్స్‌ట్రా చీజ్‌ని తొలగించే పరికరం ద్వారా వెళ్తాయి.

నెక్స్ట్ పిజ్జాలు కాల్చుతారు, పెప్పరోని ముక్కలతో టాపింగ్ చేస్తారు.వాటిని మళ్లీ కాల్చి, డెలివరీ కోసం పెట్టెల్లో ప్యాక్ చేస్తారు.

అయితే ఈ వీడియో చూసి ఇన్‌స్టాగ్రామ్‌లో పిజ్జా ప్రియులు ఇంప్రెస్ కాలేదు.దీనికి 15,000 కంటే ఎక్కువ వ్యూస్, అనేక నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.ఇది పిజ్జాలా కనిపించడం లేదని కొందరు అన్నారు.ఇతరులు దీనిని “చెత్త” అని పిలిచారు.“ఇది ఒక బిస్కెట్ లాగా ఉంది.దీన్ని పిజ్జా అని అనకండి” అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

పిజ్జాలో ఇంత పిండి కలుపుతారా అని మరికొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.భారీగా ఉత్పత్తి చేయబడిన చెత్త అని మరొకరు అన్నారు.

కొంతమంది వర్కర్స్ ను ప్రశంసించారు, కానీ ఈ పిజ్జా మాత్రం తినమని చెప్పారు.ఈ వైరల్ పిజ్జా మేకింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube