అంజలి పని బాగున్నట్టు ఉంది..!

రాజోలు అమ్మాయి అంజలి ముందు తమిళ పరిశ్రమలో ఫాలోయింగ్ ఏర్పరచుకుని ఆ తర్వాత తెలుగు సినిమాల్లో బిజీ అయ్యింది.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చిట్టు సినిమాతో టాలీవుడ్ లో కూడా సూపర్ పాపులర్ అయిన అమ్మడు ఆ తర్వాత సోలో హీరోయిన్ గా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు కానీ స్పెషల్ సాంగ్స్.

 Anjali Super Form In Ott Web Series , Anjali , Ott Web Series , Tollywood , Jha-TeluguStop.com

సైడ్ రోల్స్ తో సరిపెట్టుకుంది.ఇక OTT ల వల్ల అంజలి మళ్ళీ కెరీర్ లో బిజీ అయ్యింది.

ఇప్పటికే అంజలి పలు వెబ్ సీరీస్ లు చేయగా ఇప్పుడు మరో వెబ్ సీరీస్ తో రాబోతుంది.ఈమధ్యనే ఝాన్సీ అంటూ డిజిటల్ ఆడియన్స్ ను అలరించిన ఈ భామ ఆ సీరీస్ తో హిట్ అందుకుంది.

ఝాన్సీ 2 ఇప్పటికే డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.సినిమాలో ఛాన్స్ లు రాకపోయినా వెబ్ సీరీస్ లతో అంజలి ఫుల్ పాపులర్ అయ్యింది.ఈ వెబ్ సీరీస్ ల వల్ల అమ్మడికి మంచి మైలేజ్ వస్తుందని చెప్పొచ్చు.సినిమాల కన్నా ఇలా వెబ్ మూవీస్ ద్వారానే ప్రేక్షకులను అలరించాలని చూస్తుంది అంజలి.

ఓ పక్క ఫెడవుట్ హీరోయిన్స్ అంతా కెరీర్ ముగిసింది అని బాధపడుతుంటే అంజలి వారికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.ఇదే ఫామ్ కొనసాగిస్తే వెబ్ సీరీస్ ల నుంచి అమ్మడు సినిమాల్లో కూడా తిరిగి ఛాన్స్ లు పొందేలా ఉంది.

తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో అంజలి హవా చూస్తుంటే అమ్మడికి మళ్ళీ మంచి రోజులు వచ్చాయని అనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube