అంజలి పని బాగున్నట్టు ఉంది..!

రాజోలు అమ్మాయి అంజలి ముందు తమిళ పరిశ్రమలో ఫాలోయింగ్ ఏర్పరచుకుని ఆ తర్వాత తెలుగు సినిమాల్లో బిజీ అయ్యింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చిట్టు సినిమాతో టాలీవుడ్ లో కూడా సూపర్ పాపులర్ అయిన అమ్మడు ఆ తర్వాత సోలో హీరోయిన్ గా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు కానీ స్పెషల్ సాంగ్స్.

సైడ్ రోల్స్ తో సరిపెట్టుకుంది.ఇక OTT ల వల్ల అంజలి మళ్ళీ కెరీర్ లో బిజీ అయ్యింది.

ఇప్పటికే అంజలి పలు వెబ్ సీరీస్ లు చేయగా ఇప్పుడు మరో వెబ్ సీరీస్ తో రాబోతుంది.

ఈమధ్యనే ఝాన్సీ అంటూ డిజిటల్ ఆడియన్స్ ను అలరించిన ఈ భామ ఆ సీరీస్ తో హిట్ అందుకుంది.

"""/"/ ఝాన్సీ 2 ఇప్పటికే డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

సినిమాలో ఛాన్స్ లు రాకపోయినా వెబ్ సీరీస్ లతో అంజలి ఫుల్ పాపులర్ అయ్యింది.

ఈ వెబ్ సీరీస్ ల వల్ల అమ్మడికి మంచి మైలేజ్ వస్తుందని చెప్పొచ్చు.

సినిమాల కన్నా ఇలా వెబ్ మూవీస్ ద్వారానే ప్రేక్షకులను అలరించాలని చూస్తుంది అంజలి.

ఓ పక్క ఫెడవుట్ హీరోయిన్స్ అంతా కెరీర్ ముగిసింది అని బాధపడుతుంటే అంజలి వారికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఇదే ఫామ్ కొనసాగిస్తే వెబ్ సీరీస్ ల నుంచి అమ్మడు సినిమాల్లో కూడా తిరిగి ఛాన్స్ లు పొందేలా ఉంది.

తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో అంజలి హవా చూస్తుంటే అమ్మడికి మళ్ళీ మంచి రోజులు వచ్చాయని అనిపిస్తుంది.

ఉస్తాద్ భగత్ సింగ్ కోసం కొత్త సెట్ వేస్తున్నారా..?