సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Director Lokesh Kanagaraj ) అంటే ఇప్పుడు పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఫేమస్ అనే చెప్పాలి.ఈయన ఒకప్పుడు కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే సుపరిచితం.
కానీ ఇప్పుడు అలా కాదు.కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా తీసిన తర్వాత ఈయన క్రేజ్ అమాంతం పెరిగింది.
ఇక ఈ సినిమా తర్వాత చేస్తున్న సినిమాలను తన యూనివర్స్ లో భాగం చేస్తూ వస్తున్నాడు.

ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దళపతి విజయ్ తో ‘లియో'( Leo ) సినిమా చేస్తున్నాడు.కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్ కు తమిళ్ లో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.ఈయన ఏ సినిమా చేసిన 200 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయం.
మరి ఇప్పుడు చేస్తున్న లియో సినిమాపై కూడా అంచనాలు పెరిగి పోయాయి.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి సినిమాపై మరిన్ని హోప్స్ పెంచేస్తున్నారు.‘లియో’ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష( Trisha ) విజయ్ కు జోడీగా నటిస్తుంది.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాపై తాజాగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.

సెన్సేషనల్ హైప్ ఉన్న ఈ సినిమాకు అనిరుద్( Anirudh Ravichandran ) సంగీతం అందిస్తున్నాడు.అనిరుద్ కు తాను సంగీతం అందించే సినిమాలకు రివ్యూ ఇవ్వడం అలవాటు.ఇక ఇప్పుడు లియో సినిమాకు కూడా రివ్యూ ఇచ్చేసాడు.సోషల్ మీడియాలో జస్ట్ టైటిల్ తో కొన్ని ఫైర్ ఎమోజీస్ పెడతాడు.ఈ రివ్యూస్ కు బాగా హైప్ ఉంది.గతంలో జైలర్, జవాన్ చిత్రాలకు జవాన్ రివ్యూ ఇవ్వగా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.
ఇక ఇప్పుడు లియో సినిమాకు కూడా ఈయన రివ్యూ ఇవ్వడంతో ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు.







