మనం చూస్తూ వుంటాం.మన చుట్టూనే కొంత మంది అద్భుతమైన ట్యాలెంట్ కలిగి వుంటారు.
కానీ దానిని ప్రదర్శించే వేదిక దొరకదు.మరీ ముఖ్యంగా పేద కుటుంబాల్లో పుట్టిన చాలా మందిలో ఎనలేని ప్రతిభ ఉంటుంది.
కానీ, అది వెలుగులోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ.అయితే సోషల్ మీడియా( Social Media ) ఇపుడు అందుబాటులోకి వచ్చాక అలాంటి వారికి ఓ వరంగా మారింది అని చెప్పుకోవచ్చు.
అలాంటి వారి ట్యాలెంట్ ( Talent ) చాలా సులభంగా ఎక్కువ మందికి చేరుతోంది.ఈ క్రమంలోనే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, మనం చూసాము.
అలా ఫేమస్ అయినవారు సినిమాలలో కూడా కనబడిన దాఖలాలు వున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ డ్రమ్స్ ( Drums ) వాయిస్తున్న వీడియో ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఆ వీడియోలో మహిళకు డ్రమ్స్ వాయించే అమోఘమైన ట్యాలెంట్ ఉంది.అయితే డ్రమ్స్ సెటప్ పెట్టుకునేంత స్థోమత లేదు.
దీంతో ఆ మహిళ పనికిరాని వస్తువలతోనే డ్రమ్స్ సెటప్ ఏర్పాటు చేసింది.తన ఇంట్లో కిచెన్ సమానులనే( Kitchen Items ) ఆమె డ్రమ్స్ మాదిరి సెటప్ చేసుకోవడం కొసమెరుపు.
అనంతరం దాని మీద అద్భుతంగా వాయించింది.ఆమె వాయిస్తున్న తీరు చూస్తుంటే ప్రొఫెషనల్ డ్రమ్మర్‌లాగానే ఉంది.
ఆ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.

కట్ చేస్తే ఆమె ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ కాబడిన ఆ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.38 సెకెన్ల నిడివి గల ఆ వీడియోను ఇప్పటివరకు 6.5 లక్షల మందికి పైగా వీక్షించగా 8 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు.కాగా ఆ వీడియోలోని మహిళపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
కొంతమంది “అద్భుతం“, “వాటే ట్యాలెంట్“ అని కామెంట్స్ చేస్తే మరికొంతమంది “ఆమెకు ప్రోత్సాహం దక్కి ఉంటే చాలా బాగుండేది“, “ఇలాంటి వారు ఎంతో మంది చీకటిలోనే ఉండిపోతున్నారు“ అంటూ కామెంట్లు చేశారు.







