సాధారణం ఒక వ్యక్తి జీతం మరీ ఎక్కువ అంటే రోజుకు లక్ష రూపాయలుగా ఉంటుంది.అయితే ఒక వ్యక్తి జీతం మాత్రం రోజుకు 72 లక్షల రూపాయలు కావడం గమనార్హం.
ఇతని ఏడాది సంపాదన ఏకంగా 2200 కోట్ల రూపాయలుగా ఉంది.అనిరుధ్ దేవగన్ ( Anirudh Devgan )సక్సెస్ స్టోరీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి అనిరుధ్ దేవగన్ కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్ ప్రెసిడెంట్, సీఈఓ అండ్ బోర్డ్ మెంబర్ గా ఉన్నారు.
2012లో ఈ సంస్థలో అనిరుధ్ కెరీర్ మొదలు కాగా 2017 సంవత్సరంలో ఆయన కంపెనీ ప్రెసిడెంట్ కావడం జరిగింది.2021 సంవత్సరంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ స్థానంను పొందిన అనిరుధ్ ఆ తర్వాత సీఈవో అయ్యారు.అనిరుధ్ ఢిల్లీలో పుట్టి పెరిగినా అమెరికాలో ఉన్న కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో( Carnegie Mellon University ) ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లో ఎం.ఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు.ఎక్కువ వేతనం తీసుకుంటున్న అమెరికన్ సీఈవోలలో ఇతను కూడా ఒకరు కావడం గమనార్హం.

పట్టుదల, సాధించాలనే కసితో అనిరుధ్ ఈ స్థాయికి చేరుకున్నారు.అనిరుధ్ దేవగన్ తన టాలెంట్ తో ప్రశంసలు అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.అనిరుధ్ తన సంపాదనతో ఎంతోమందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అనిరుధ్ తన టాలెంట్ తో ఈ స్థాయికి చేరుకున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

అనిరుధ్ దేవగన్ ను స్పూర్తిగా తీసుకుంటే మనం కూడా కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో విజయాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.అమెరికన్ సీఈవోగా పని చేస్తూ కోట్లు సంపాదిస్తూ మన దేశ కీర్తి ప్రతిష్టలను అనిరుధ్ దేవగన్ అంతకంతకూ ఎదుగుతున్నారు.అనిరుధ్ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.







