నందమూరి బాలకృష్ణ ( Balakrishna )వరుస సినిమాలు చేస్తూనే ఒక టాకింగ్ షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అన్ స్టాపబుల్ షోతో( unstoppable show ) బాలయ్య మొదటిసారి వ్యాఖ్యాతగా మారిపోగా ఈ షో ఈయనపై ఉన్న నెగిటివిటీ మొత్తం పోయేలా చేసింది.
ఈ షో సీజన్ 1 ఘన విజయం సాధించింది.
దీంతో వరుసగా సీజన్స్ చేస్తూనే ఉన్నాడు.
రెండు సీజన్స్ గ్రాండ్ గా ముగించడంతో బాలయ్య హోస్ట్ గా కూడా సక్సెస్ అనిపించుకున్నారు.ఇదిలా ఉండగా ఇటీవలే మూడవ సీజన్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేసారు మేకర్స్.
ఈ సీజన్ లో భగవంత్ కేసరి టీమ్ మొదటి ఎపిసోడ్ లో సందడి చేయగా ఇప్పుడు యానిమల్ టీమ్ ఎపిసోడ్ 2 కోసం వచ్చారు.

ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో తాజాగా యానిమల్ టీమ్ సందడి చేసిన ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ కు తెచ్చారు.దీంతో ప్రేక్షకులు ఈ షోను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ ఎపిసోడ్ 25 మిలియన్స్ కు పైగానే స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకెళ్తుంది.

ఈ ఎపిసోడ్ లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ), రష్మిక ( Rashmika Mandanna ) పాల్గొనగా బాలయ్య తనదైన శైలిలో ముచ్చటించారు.కాగా డిసెంబర్ 1న గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు హర్ష వర్ధన్ సంగీతం అందిస్తుండగా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.మరి ఈ సినిమా తెలుగులో ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.







