ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు 'ఏజెంట్'లో ఉన్నాయట!

అక్కినేని అఖిల్ (Akhil Akkineni) టాలెంట్ గురించి అందరికి తెలుసు.ఈయన డ్యాన్స్ లో నటనలో ప్రేక్షకుల చేత నూటికి నూరు మార్కులు వేయించు కున్నారు.

 Anil Sunkara Revealed Interesting Things About Akhil's 'agent', Anil Sunkara, Ak-TeluguStop.com

బ్యాచిలర్ సినిమాతో ఎట్టకేలకు ఒక హిట్ అయితే తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక అఖిల్ ఇప్పటి వరకు తన కెరీర్ లో చేసిన సినిమాలన్నీ లవ్ స్టోరీలుగానే తెరకెక్కాయి.

అయితే బ్యాచిలర్ తర్వాత అఖిల్ మాస్ యాక్షన్ డ్రామాకు ఓకే చెప్పాడు.

ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో ”ఏజెంట్” (Agent Movie) సినిమాను చేస్తున్నాడు.

యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అఖిల్ గత రెండేళ్లుగా టైం కేటాయించి మరొక సినిమా చేయకుండా ఈ సినిమా కోసం కష్ట పడుతున్నాడు.ఈ సినిమాను సురేందర్ 2 సినిమాస్ తో కలిసి ఏకే ఎంటెర్టాన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

అఖిల్ రా ఏజెంట్ గా కనిపించ నుండగా.ఈయనకు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.కీలక పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) నటిస్తున్నాడు.అలాగే హిప్ హప్ తమిజా సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

ఈ క్రమంలోనే వరుసగా ప్రమోషన్స్ చేసేందుకు టీమ్ అంతా సిద్ధం అవుతుంది.

ఈ క్రమంలోనే నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) ఈ సినిమా గురించి ట్విట్టర్ లో అక్కినేని ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.ఈయన చెబుతూ.అఖిల్ తో వర్క్ చేయడం నిజంగా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అని.సినిమా ఆద్యంతం ఆకట్టుకునే యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కలగలిపి సాగుతుందని.ట్రైలర్ మరో లెవల్లో ఉంటుందని ఈ సినిమాలో అక్కినేని ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయని అన్నారు.

సురేందర్ రెడ్డి అన్ని అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించాడని.రిలీజ్ తర్వాత మీ అందరికి అంచనాలకు మించి మా ఏజెంట్ మూవీ ఉంటుందని అనిల్ సుంకర చెప్పుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలతో ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ మరింత హోప్స్ పెంచుకున్నారు.ఇక ట్రైలర్ (Agent Trailar)రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube