డైరెక్షన్ మానేస్తే అటువైపు వెళ్తా.. నన్ను బాగా హర్ట్ చేసిన హీరోయిన్ తనే: అనిల్ రావిపూడి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తాజాగా ఎఫ్ 3 సినిమా ద్వారా మరొక అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

ఇక అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్ నందమూరి నటసింహం బాలకృష్ణతో చేయనున్న విషయాన్ని ప్రకటించారు.ఇక ఈ సినిమా విజయవంతమైన తరువాత అనిల్ రావిపూడి ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె కార్యక్రమానికి హాజరయ్యారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.ఈ ప్రోమోలో భాగంగా అనిల్ రావిపూడి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయనకి ఎంతో ఇష్టమైన హీరోయిన్ గురించి వెల్లడించారు.తనకు నగ్మా అంటే ఎంతో ఇష్టమని ఆ హీరోయిన్ తనని బాగా హర్ట్ చేసిందని ఈ సందర్భంగా వెల్లడించారు.

Advertisement

ఇకపోతే దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీరు దర్శకత్వం మానేస్తే ఎలాంటి రంగాన్ని ఎంచుకుంటారని ప్రశ్నించగా అందుకు ఆయన సమాధానం చెబుతూ తాను దర్శకత్వం మానేస్తే కచ్చితంగా ఆర్టిస్ట్ అవుతానని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తెలియజేశారు.తనకు డైరెక్షన్ తో పాటు నటన కూడా ఎంతో ఇష్టమనీ, అందుకే ఆర్టిస్ట్ అవుతానని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి వెల్లడించారు.

ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 
Advertisement

తాజా వార్తలు