NBK108 : ”గిది శాంపిల్ మాత్రమే”.. సినిమా ముందుంది అంటున్న అనిల్!

నిన్న ఉగాది పండుగ కానుకగా మన టాలీవుడ్ లో కొత్త సినిమాల నుండి వరుస అప్డేట్స్ వచ్చి ఫ్యాన్స్ ను అలరించిన విషయం తెలిసిందే.మరి ఈ అప్డేట్ లలో నందమూరి నటసింహం బాలయ్య ( Balakrishna )నటిస్తున్న లేటెస్ట్ మూవీ అప్డేట్ కూడా ఉంది.

 Anil Ravipudi About Nandamuri Balakrishnas Nbk108 First Look Poster-TeluguStop.com

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో ప్రజెంట్ బాలయ్య తన నెక్స్ట్ సినిమాను చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా దాదాపు సగం పూర్తి కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

ఇక నిన్న ఈ సినిమా నుండి ఉగాది ( Ugadi )కానుకగా అదిరిపోయే మాస్ పోస్టర్ ను రివీల్ చేసారు.ఈ పోస్టర్ లలో బాలయ్య ఎవ్వరూ ఊహించని అవతార్ లో కనిపించి నందమూరి ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చారు.

బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనుండగా ఒక లుక్ వింటేజ్ బాలయ్యను తలపించేలా ఉంది.

బాలకృష్ణ మేకోవర్ పై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇదిలా ఉండగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు వచ్చిన స్పందనపై అనిల్ రావిపూడి తాజాగా ఒక పోస్ట్ చేసి తన సంతోషం వ్యక్తం చేసారు.”గిది శాంపిల్ మాత్రమే” ఆ లుక్కే అన్నిటిని చెబుతుంది అంటూ మరింత సినిమా ముందు ఉంది అన్నట్టు చెబుతూ మరో ఫోటోను రిలీజ్ చేసారు.ఫ్యాన్స్ రెస్పాన్స్ కు ధన్యవాదాలు తెలిపారు.ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న విషయం విదితమే.ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తుండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.అలాగే ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube