దేశం మొత్తం ఉలిక్కిపడే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.అదే కరోనాకు ఆయుర్వేద వైద్యం.
ఒక్కరోజులోనే ఈ వార్త మహామహులను ఆలోచింపచేసింది.అసలు ఇందులో ఉన్న నిజం ఎంత అనే చర్చ ప్రస్తుతం హట్ టాపిక్‌గా మారింది.
ఇక్కడ అర్ధం కాని విషయం ఏంటంటే లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నప్పుడు కరోన విషయంలో ప్రజలు అయోమయంలో పడేలా వైద్యులు ఎన్నో సూచనలు చేసిన విషయం తెలిసిందే.ఇప్పటికి కరోనా విషయంలో రోగులు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే క్లారిటీ లేదు.
అసలు ప్రజలు ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుని బ్రతుకుతున్న సమయంలో సంజీవినిలా కృష్ణపట్నంలో ఆనందయ్య అందిస్తున్న కరోనా ఆయుర్వేద మందు మారింది.
ఒక ఇంగ్లీష్ మెడిసిన్ బయటకు రావాలంటే ఎన్నో ఆంక్షలు, వాటి మీద రిసెర్చ్‌లు జరిగితే కానీ ఫలితం తేలదు.
కానీ ఈ ఆయుర్వేద మందు విషయంలో డైరెక్ట్‌గా రోగుల మీదే ప్రయోగించగా ఎందరో కోలుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.మరి ఇది నిజంగా కరోనాను నివారించగలిగితే లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఊరట లభిస్తుంది కదా! మరి ఇంతటి మహత్తరమైన అంశం మీద అనవసర రాద్దాంతం జరుగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారట.
ఇకపోతే ఈ ఆయుర్వేద మందు విషయంలో ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇప్పటి వరకు జరిగిన అధ్యయనంలో ఆనందయ్య ఆయుర్వేదం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదనే చెబుతున్నారని, అయితే, శాస్త్రీయపరంగా మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.