వైరల్: సిగరెట్ తాగుతున్న అమ్మాయిలను గమనిస్తున్న వృద్ధుడు ఓ రోజు ఏంచేశాడంటే?

ఇపుడు ఇక్కడ మన నేటితరం గురించి మాట్లాడుకోవడం దుర్లభం.ప్రధానంగా ఇక్కడ యువతీయువకులు చెడు అలవాట్లకు బానిసలై( Youth Bad Habits ).

 Angry At Smoking Girls 70-year-old Man Sets Indore Cafe On Fire,indore Cafe,old-TeluguStop.com

ఎక్కడ ఏం చేస్తున్నారో వారికే తెలీనంత మాయలోపడి కొట్టుకుంటున్నారు.ఇలాంటి వారిని చూసినప్పుడు నిన్న మొన్నటి తరానికి చాలా కోపం వస్తుంటుంది.

అయినా చేసేదీలేమీలేక మిన్నకుండిపోతుంటారు.అయితే ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వృద్ధుడు మాత్రం అందరిలా ఊరుకోలేదు.

కేఫ్‌లో కొందరు అమ్మాయిలు రోజూ సిగరెట్లు తాగుతూ వుంటే ఆ పెద్దాయన చాటుగా గమనించేవాడు.ఈ క్రమంలో ఓ రోజు రాత్రి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.

Telugu Bad Habits, Cctv Footage, Cigarrates, Indore Cafe-Latest News - Telugu

విషయంలోకి వెళితే, మధ్యప్రదేశ్ ఇండోర్‌( Indore )లోని లసుడియా ప్రాంతంలో స్థానిక స్కై కార్పొరేట్ సమీపంలో ఉన్న ఓ కేఫ్ వద్దకు నిత్యం చాలా మంది యువతీయువకులు వస్తూ పోతూ వుంటారు.ఈ క్రమంలో వారంతా అక్కడ సిగరెట్లు తాగుతుండేవారు.కొన్నిసార్లు అమ్మాయిలు కూడా అక్కడికి వచ్చి సిగరెట్లు( Cigarrates ) గుప్పుగుప్పుమని లాగుతూ వుండేవారు.ఇక ఇదే ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల విజన్ మాతే( 70 Year Old Man ) అనే వృద్ధుడు కూడా ఈ కేఫ్ వద్దకు వెళుతుండేవాడు.

ఈ క్రమంలో వృద్ధుడు సిగరెట్ తాగుతున్న అమ్మాయిలను చూసి మొదట షాక్ అయ్యాడు.యువత ఇలా చెడిపోతోందేంటీ.అని మనసులో అనుకుని వెళ్లిపోయాడు.అయితే తాను అక్కడికి వచ్చినప్పుడల్లా సదరు అమ్మాయిలు సిగరెట్ తాగుతూ కనిపిస్తుండేవారు.

దీంతో అతడికి పట్టరాని కోపం వచ్చేది.

Telugu Bad Habits, Cctv Footage, Cigarrates, Indore Cafe-Latest News - Telugu

కానీ వారిని ఏమీ అనలేక బాధపడుతూ వెళ్లిపోతూ ఉండేవాడు.ఇలా ప్రతి రోజూ వారు సిగరెట్ తాగుతూ కనిపించడాన్ని జీర్ణించుకులేకపోయాడు ఆ పెద్దాయన.ఎలాగైనా వారిని అక్కడికి రాకుండా చేయాలని అనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా ఓ రోజు రాత్రి అతను నేరుగా కేఫ్ వద్దకు వెళ్లి పెట్రోల్ పోసి నిప్పు( Fires Cafe ) పెట్టాడు.దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.

చుట్టు పక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఫుటేజీ( CCTV Footage )లో కేఫ్‌కు వృద్ధుడు నిప్పు పెట్టినట్లు నిరూపణ అయ్యింది.చివరకు ఆయన “విజన్ మాతే”ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.

అంతేకాదు యువతరం చెడిపోవడాన్ని చూసి భరించలేక ఇలా చేశానని చెప్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube