ఇప్పటికే ఏపీలో పొత్తు పెట్టుకున్న టిడిపి జనసేన మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో టిడిపి అధినేత చంద్రబాబును పరామర్శించేందుకు స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ( Chandrababu )ఇంటికి వెళ్ళారు.
వాస్తవంగా చంద్రబాబు జైలు నుంచి విడుదలైన సమయంలో పవన్ వరుణ్ తేజ్ వివాహానికి హాజరయ్యేందుకు ఇటలీ వెళ్లడంతో అప్పుడు కలవలేదు.దీంతో ఇటలీ నుంచి వచ్చిన మరుసటి రోజు చంద్రబాబుతో ఆయన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య విషయాల గురించి చర్చించిన పవన్ అనంతరం ఏపీ తెలంగాణ రాజకీయాల గురించి చర్చించారట.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) తో నారా లోకేష్ చర్చించారట.
ఈ సందర్భంగా పవన్( Pawan Kalyan ) తో పాటు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar )తోను లోకేష్ చర్చించారు.రాబోయే ఎన్నికల్లో ఏపీలో రెండు పార్టీలు కలిసి ఏ విధంగా పోరాటం చేయాలి , రెండు పార్టీల్లోని పొత్తుపై అసంతృప్తులు పెరిగిపోతోందడంతో వీరిని ఏ విధంగా కట్టడి చేయాలి అనే విషయాలపై చర్చించారట. ఇప్పటికే రెండు పార్టీల సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయడంతో ఈ కమిటీలు రెండు పార్టీల్లోని అసంతృప్తులను తగ్గించి పార్టీ తరపున కలిసి పోరాడే విధంగాను, ప్రజలకు దగ్గరయ్యి ఎన్నికల ప్రచారం చేపట్టే విధంగానూ వైసిపి ప్రభుత్వం వైఫల్యాల పైన ప్రత్యేకంగా దృష్టి సారించి, ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలను తీసుకువెళ్లే విధంగా ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయట.దీంతో పాటు , నారా లోకేష్( Nara lokesh ) పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడి గా భారీ బహిరంగ సభలను నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారట.
రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో లోకేష్ ( Nara lokesh )పవన్ కలిసి ఉమ్మడిగా బహిరంగ సభలలో పాల్గొని , టిడిపి జనసేన విధానాలను ప్రజలకు వివరించడంతో పాటు, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను హైలెట్ చేసే విధంగా ప్రసంగాలు చేయబోతున్నారట .దీంతోపాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, బహిరంగ సభల ద్వారా ప్రజలను నేరుగా కలుసుకోవడం వంటి విషయాల పైన దృష్టి సారించనున్నారట.డిసెంబర్ తొలి వారం నాటికి రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను తయారుచేయలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.