ఎంతమంది యాంకర్లు వచ్చిన వాళ్లంతా సుమ తర్వాతనే అని చెప్పాలి.ప్రస్తుతం యాంకర్ల లిస్టులలో యాంకర్ సుమనే మొదటి స్థానంలో ఉంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ యాంకర్ గా నిలిచి మంచి పేరు సంపాందించుకుంది.స్టార్ నటినటులకు ఉన్నా క్రేజ్ యాంకర్ సుమకు( Anchor Suma ) ఉంది.
ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.బుల్లితెరపై ఎన్నో ఏళ్ల నుండి యాంకరింగ్ చేస్తూ స్టార్ యాంకర్ గా నిలిచింది.
వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.కానీ సుమ కు యాంకర్ గానే మంచి క్రేజ్ వచ్చింది.
ఒక ఎంటర్టైన్మెంట్ షో లలోనే కాకుండా వెండితెర కు సంబంధించిన సినీ అవార్డు ఫంక్షన్లలో, ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో ఇలా ప్రతి ఒక్క ఈవెంట్ లో సుమ తన హోస్టింగ్ తో బాగా సందడి చేస్తుంది.
ఏ స్టార్ హీరోల సినిమాలైనా సరే వాళ్ల సినిమా ఈవెంట్లకు యాంకర్ సుమనే హోస్ట్ చేయాలి.
చాలామంది దర్శకులు కూడా తమ సినిమాలకు సుమనే హోస్ట్ చేయాలి అని.సుమకు డేట్స్ కుదరకున్నా సరే సుమ కు డేట్ కుదిరిన రోజే సినిమా ఈవెంట్ ను నిర్వహిస్తుంటారు.అలా అంతలా సుమ అందరికీ బాగా దగ్గరయింది.
</
ప్రస్తుతం బుల్లితెరపై బాగా బిజీగా ఉంది.ఇక సుమ మాటలు వింటే మాత్రం ఎవరైనా కరగాల్సిందే.తను వేసే పంచులు కూడా ఇతరులను నొప్పించకుండా ఉంటాయి.
పైగా అందరిని ఎలా కనెక్ట్ చేసుకోవాలో సుమకు తెలుసు.సుమ అంటేనే మంచి ఎంటర్టైన్మెంటర్.
ఇతర భాషలకు చెందిన సెలబ్రెటీలను కూడా సుమ ఒక రేంజ్ లో ఆట ఆడిస్తుంది.
ఇక సుమ సోషల్ మీడియా( Social media )లో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.అందులో కూడా ఫన్నీ వీడియోస్ షేర్ చేస్తూ తెగ నవ్విస్తూ ఉంటుంది.తన దగ్గర నుంచి ఏదైనా వీడియో వచ్చింది అంటే అందులో కచ్చితంగా కామెడీ ఉన్నట్లే అని చెప్పవచ్చు.
యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ పంచుకుంది.అయితే ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా సుమ వెకేషన్ ట్రిప్ కి వెళ్లి అక్కడ మంచు కొండలలో బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపించింది.
</div
ఇక వాటికి సంబంధించిన కూడా ఫొటోస్ పంచుకుంది.అయితే తాజాగా తను ఒక ఫోటో షేర్ చేసుకోగా అందులో తన పాదాలకు గాయమైనట్లు కనిపించింది.దీంతో తను మంచు కొండలలో బాగా ఆడినందుకు ఇలా అయిందేమో అని తన అభిమానులు అనుమానం పడుతున్నారు.అయితే మరి కొంతమంది ఆమెకు తగిలిన గాయాన్ని చూసి ట్రోల్స్ చేస్తున్నారు.
ఇంతకు అసలు విషయం ఏంటంటే ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ఆది పురుష్( Adipurush ) ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఆ ఈవెంట్ కు సుమనే హోస్ట్ చేయాల్సి ఉండేది.
కానీ తను వెకేషన్స్ లో ఉండటంతో.ఆ బాధ్యతను యాంకర్ ఝాన్సీ తీసుకుంది.
ఇక ఆ ఈవెంట్లో సుమ లేకపోవడంతో చాలా బోరింగ్ గా అనిపించింది అంటూ.ఎంటర్టైన్మెంట్ అనేది మిస్సయింది అంటూ వాపోయారు.
ఇక సుమ వెకేషన్స్ లో ఉండి ఆ ఈవెంట్ కు రాకపోయేసరికి.ఆ పాపమే మిమ్మల్ని గాయం రూపంలో వెంటాడింది అంటూ సరదాగా ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.